ప్రధానాంశాలు:
ఎస్‌బీఐ ఎస్‌సీఓ రిక్రూట్‌మెంట్ 2022
714 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ
సెప్టెంబర్ 20 దరఖాస్తులకు చివరితేది
SBI SO Recruitment 2022: ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచిల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 714 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (Specialist Cadre Officer) పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మేనేజర్, రిలేషన్ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, సీనియర్ రిలేషన్ మేనేజర్, రీజినల్ హెడ్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 714
పోస్టులు: మేనేజర్, రిలేషన్ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, సీనియర్ రిలేషన్ మేనేజర్, రీజినల్ హెడ్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులున్నాయి.
విభాగాలు: డాట్‌నెట్ డెవలపర్, జావా డెవలపర్, బిజినెస్‌ప్రాసెస్, ఆపరేషన్స్ టీమ్, బిజినెస్ డెవలప్‌మెంట్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ బీటెక్/ బీఈ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంసీఏ/ ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్)/ ఎంబీఏ/ పీజీ/ పీజీడీఎం ఉత్తీర్ణత ఉండాలి.
వయసు:
పోస్టును అనుసరించి 01.04.2022 వరకు 20-50 ఏళ్లు ఉండాలి.
పని అనుభవం: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 02 ఏళ్లు నుంచి 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
మేనేజర్, ఇంజినీర్ ఉద్యోగాలకు మాత్రం దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. అందులో ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపడతారు.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.750.
దరఖాస్తు చివరి తేది: సెప్టెంబర్ 20, 2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://sbi.co.in/web/careers
పరీక్ష విధానం:
ఆన్‌లైన్ పరీక్షలో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్, ఐటీ నాలెడ్జ్, రోల్ బేస్డ్ నాలెడ్జ్ సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 శాతం మార్కులకు గాను 70 శాతం ఆన్‌లైన్ పరీక్ష నుంచి మరో 30శాతం మార్కులను ఇంటర్వ్యూ ఆధారంగా కేటాయిస్తారు.
రీజనింగ్:
ఇందులో అభ్యర్థుల తార్కిక ఆలోచన విధానాన్ని పరిశీలిస్తారు. నంబర్లు, డిజైన్ల మధ్య సంబంధాలు, కోడింగ్, డీ-కోడింగ్, అనాలజీ, సిరీస్, డైరెక్షన్స్, సీటింగ్ అరెంజ్ మెంట్స్, రక్తసంబంధాలు, ర్యాంకింగ్, పజిల్స్, ఆల్ఫాబెట్ టెస్ట్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్:
ఇందులో అభ్యర్థుల సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని; అంకెలు, సంఖ్యలపై పట్టును; గణిత నైపుణ్యాలను అంచనా వేస్తారు. దీనికి సంబంధించి గణితంలో కీలక భావనలైన కూడికలు, తీసివేతలు, భాగహారాల వంటి వాటిపై పట్టు సాధించాలి. నిష్పత్తులు, శాతాలు, వర్గమూలాలు, ఘనమూలాలు, లాభ-నష్టాలు, కాలం-పని, కాలం-దూరం మొదలైన అంశాలను ప్రాథమిక స్థాయి నుంచి ప్రాక్టీస్ చేయాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్:
విధి నిర్వహణలో భాగంగా ఆంగ్లంలో వచ్చే రకరకాల పత్రాలను సరిగా అర్థం చేసుకోడానికి కనీస ఇంగ్లిష్ నాలెడ్జ్ అవసరం. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, రీడింగ్ కాంప్రహెన్షన్, జంబుల్డ్ సెంటెన్సెస్, రూట్ వర్డ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ తదితర విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment