ఎట్టకేలకు సస్పెన్స్ వీడిండి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది అధిష్టానం. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అటు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు.
కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందని ప్రచారం సాగుతోంది. దానికి తగ్గట్టే అధిష్టానం తాజాగా నిర్ణయం తీసుకుంది. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాష్ట్ర నాయకత్వంలో బీజేపీ హైకమాండ్ కీలక మార్పులు చేయడం ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది చర్చనీయాంశంగా మారింది.
ఇటు తెలంగాణ బీజేపీ చీఫ్ పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అనంతరం బండి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈయనకు కేంద్ర కేబినెట్ లో స్థానం కల్పిస్తారని ప్రచారం సాగుతోంది. అలాగే, ఈటల రాజేందర్ ను బీజేపీ రాష్ట్ర ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ గా నియమించింది అధిష్టానం.
మరోవైపు, బీజేపీ ఏపీ నూతన అధ్యక్షురాలిగా దుగ్గుబాటి పురంధేశ్వరిని నియమించారు. సోము వీర్రాజుకు జేపీ నడ్డా ఫోన్ చేసి.. ‘మీ పదవీకాలం ముగిసింది.. మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. మీరు రాజీనామా చేయండి’ అని సూచించారు. దీంతో ఆయన రాజీనామా చేశారు. ఇటు ఈమధ్యే బీజేపీ గూటికి చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమించింది హైకమాండ్.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment