Breaking

Search Here

08 July 2023

జాబ్స్​ స్పెషల్​.. కరెంట్​ అఫైర్స్


సొలిసిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తుషార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెహతా

తుషార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెహతా భారత సొలిసిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మళ్లీ నియమితులయ్యారు.2018 అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10న మొదటిసారిగా సొలిసిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియమితులైన తుషార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెహతా పదవీ కాలాన్ని ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది. 2026 జూన్ 30వ తేదీ వరకు సొలిసిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తుషార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెహతా ఉంటారు

వెర్సోవా - బాంద్రా సీ లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సావర్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు

మహారాష్ట్రలోని ఏక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిండే ప్రభుత్వం వెర్సోవా - బాంద్రా సీ లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వీడీ సావర్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేతుగా పేరు పెట్టింది. ముంబయి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హార్బర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మాజీ ప్రధాని అటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిహారీ వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి పేరును ఖరారు చేసింది. 17 కి.మీ.ల ఈ వంతెన అంధేరీని బాంద్రా - వర్లి సీ లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అనుసంధానం చేయనుంది.

ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీసికి రెండు అవార్డులు

నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీసీ)కి ‘మినరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు’, ‘ఎంప్లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ది ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అవార్డులు వరించాయి. కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాలో నిర్వహించిన అసోచామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్సలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2023లో వీటిని అందజేశారు.

ఎలిఫెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విస్పరర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  పర్యావరణ పురస్కారం 

ఆస్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు గెలుచుకున్న ఉత్తమ లఘుచిత్ర డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విస్పరర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ దర్శకురాలు కార్తీకీ గోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాల్వెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ‘ఎలిఫెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీ’ సంస్థ అందించే పర్యావరణ పురస్కారం లభించింది. తారా అవార్డును బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజు మూడో ఛార్లెస్, రాణి కెమీలియా  ప్రదానం చేశారు. 

పి.ఎం.ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

కోల్​ ఇండియా సంస్థ కొత్త చైర్మన్​గా పి.ఎం.ప్రసాద్​ జులై 1న బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 780 మిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యానికి ప్రాధాన్యమిస్తూ కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా పని చేస్తుందని ఆయన తెలిపారు.

పుల్లెల గోపీచంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

భారత బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుల్లెల గోపీచంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హ్యూమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్సలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కర్ణాటక) గౌరవ డాక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రదానం చేసింది. గోపీచంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మరో నలుగురు యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా డాక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకున్నారు.

అజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగార్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇండియా మాజీ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగార్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బీసీసీఐ భారత సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పురుషుల క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియమించింది.   అగార్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 191 వన్డేలు, 26 టెస్టులు, 4 టీ20లు ఆడాడు. ఈ మూడు ఫార్మాట్లలో వరుసగా 288, 58, 3 వికెట్లు పడగొట్టాడు.

వి.ఎం.రెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నేషనల్‌‌‌‌ కేడెట్‌‌‌‌ కార్ప్స్‌‌‌‌ (ఎన్‌‌‌‌సీసీ) డిప్యూటీ డైరెక్టర్‌‌‌‌ జనరల్‌‌‌‌ (డీడీజీ)గా ఎయిర్‌‌‌‌ కమాండర్‌‌‌‌ వి.ఎం.రెడ్డి నియమితులయ్యారు. 

నీరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చోప్రా 

భారత స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జావెలిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రో అథ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చోప్రా డైమండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లూసానె అంచె పోటీల్లో బరిలో దిగి స్వర్ణం నిలబెట్టుకున్నాడు. లూసానెలో 87.66 మీటర్ల దూరం ఈటెను విసిరి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అయిదో ప్రయత్నంలో ఉత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచాడు.

సీజేగా  అలోక్ ఆరాధే

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అలోక్ ఆరాధేలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్​ను నియమించింది. 

రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు

భారతీయ జనతా పార్టీ తెలంగాణకు కొత్త అధ్యక్షుడిగా జి. కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని, అలాగే ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దగ్గుబాటి పురందేశ్వరిని నియమించింది. ఎన్నికల మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించింది.

నాటో అధిపతి స్టోల్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నార్త్​ అట్లాంటిక్​ ట్రీటీ ఆర్గనైజేషన్​ (నాటో) ప్రధాన కార్యదర్శి జెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోల్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవీ కాలాన్ని పొడిగించాలని 31 సభ్య దేశాలు నిర్ణయించాయి. ఆయన 2024 అక్టోబరు 1 వరకు ఆ పదవిలో ఉంటారు. స్టోల్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2014 నుంచి నాటో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

ట్విటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోటీగా ‘థ్రెడ్’

ట్విట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ కు పోటీగా  మెటా సీఈవో మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జుకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘థ్రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పేరుతో  ట్విటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరహా మైక్రో బ్లాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేశారు. యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరాలు గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లే స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాపిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లే స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే అందుబాటులోకి వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చేశాయి.

మహిళా బ్యూటీ సెలూన్లపై నిషేధం

అఫ్గానిస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజధాని కాబూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మహిళా బ్యూటీ సెలూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై తాలిబన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక నుంచి మహిళలు బ్యూటీ సెలూన్లు నడపకూడదని మంత్రి మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. ఈ మేరకు కాబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీకి ఆదేశాలు జారీ చేశారు.

చంద్రయాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-3 రెడీ

ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీఎం-3పీ4 రాకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చంద్రయాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-3 అంతరిక్ష నౌకను అనుసంధానించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. జులై 13న చంద్రయాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-3 ప్రయోగాన్ని నిర్వహించనున్నామని ఇస్రో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments