మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్ గా సునీల్ తత్కారే.. ప్రకటించిన అజిత్ వర్గం
మహారాష్ట్ర ఎన్సీపీలో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. రాష్ట్ర కొత్త ఎన్సీపీ చీఫ్ గా ఎంపీ సునీల్ తత్కారేను నియమిస్తున్నట్టు అజిత్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ ని ఆయన పదవి నుంచి తొలగించి ఈ పోస్ట్ లో సునీల్ ను నియమిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇక జయంత్ పాటిల్ తక్షణమే తన అధ్యక్ష బాధ్యతలను సునీల్ కి అప్పగించాలన్నారు.
ఇకపై అన్ని నిర్ణయాలూ సునీల్ తీసుకుంటారన్నారు. అధికారికంగా ఈయన మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు.. ఇప్పటి నుంచే అన్ని నిర్ణయాలూ ఈయనే తీసుకుంటారు అని పేర్కొన్నారు. లెజిస్లేచర్ పార్టీ నాయకునిగా అజిత్ పవార్ ను తాము ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని అసెంబ్లీ స్పీకర్ కి కూడా ఈ విషయం తెలియజేశామని ప్రఫుల్ పటేల్ చెప్పారు.
మరి ఎన్సీపీ జాతీయ అధ్యక్షునిగా ఎవరన్న ప్రశ్నకు అజిత్ పవార్.. . శరద్ పవార్ అన్న విషయాన్ని మీరు మరిచిపోయారా అని మీడియాను ఉద్దేశించి అన్నారు. ఇక పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను సునీల్ తత్కారేను, ప్రఫుల్ పటేల్ ను పార్టీలో కొనసాగకుండా అనర్హులుగా ప్రకటించాలని ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే ప్రతిపాదించారు.
దీంతో శరద్ పవార్.. వారిని మరికొందరిని పార్టీలో అనర్హులుగా ప్రకటించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీరిద్దరూ హాజరైనందుకు తామీ చర్య తీసుకుంటున్నామన్నారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment