Breaking

Search Here

02 July 2023

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్‌సీపీదే జయభేరీ

 


ఆంధ్రప్రదేశ్ 175/175 అని తరచుగా చెబుతోన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటనలు ఎంత మాత్రం అతిశయోక్తి కాదంటున్నాయి తాజా సర్వేలు. ప్రముఖ జాతీయ మీడియా టైమ్స్ నౌ నవభారత్ చేపట్టిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమయింది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే.. వైఎస్సార్ సీపీ భారీ విజయాన్ని సాధిస్తుందని తెలిపింది.



ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే.. 25కు 24 లేదా 25 వస్తాయని సర్వే తెలిపింది. ప్రతిపక్షంలో ఉన్న తెలుగు దేశం పార్టీకి 0-1 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని, ఆ పార్టీకి అంతకంటే మించి అవకాశం లేదని తెలిపింది.


ప్రతిపక్షంలో ఉన్న తెలుగు దేశం పార్టీకి 0-1 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని, ఆ పార్టీకి అంతకంటే మించి అవకాశం లేదని తెలిపింది. ఇక విలువలు మరిచి బూతులకు పరిమితమైన పవన్ కళ్యాణ్ కు కనీసం ఒక్క సీటు కూడా రాదని సర్వే అంచనా వేసింది. ఇచ్చిన ప్రతీ హామీని వందశాతం నెరవేర్చడంతో పాటు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో నడిపిస్తోన్న సీఎం జగన్‌ ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని తెలిపింది. 2019లో ఒక ప్రభంజనంలా వచ్చిన వైఎస్సార్‌సీపీ.. ఆ ఎన్నికల్లో 22 లోక్ సభ ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది


ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే గడువు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అదే ఊపును కొనసాగించడం, ఓ రకంగా అంతకంటే ఎక్కువగా సీట్లను గెలుచుకునే అవకాశాన్ని, పరిస్థితులను సృష్టించుకోవడం ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌కే చెల్లింది.



No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments