Ratan Tata: రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ
రతన్ టాటా గురించి భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలకు బాగా తెలుసు. కేవలం దిగ్గజ పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. దేశం కోసం తనదైన రీతిలో సేవ చేస్తూ.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిగా కూడా. ఈయన ఇటీవల ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రతన్ టాటా పోస్ట్..
వర్షాకాలం మొదలైంది, వర్షాలు భారీగా కురుస్తున్న వేళ వాహనదారులు హడావిడిగా వాహనాలు నడుపుతూ ఉంటారు. అయితే కొంత మంది చేసే చిన్న తప్పిదాలు చాలా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. వర్షం పడే సమయంలో మూగజీవాలు వాహనాల కింద ఉండే అవకాశం ఉంటుంది. కావున వాహనాలను తీసేటప్పుడు తప్పకుండా కింద ఏమైనా ఉన్నాయా అని గమనించండి, లేకుంటే అవి తీవ్రంగా గాయపడి అవకాశం ఉంటుందని, కావున వాటికి ఆశ్రయం కల్పిస్తే చాలా గొప్పగా ఉంటుందని సోషల్ మీడియా వేదికగా రతన్ టాటా విజ్ఞప్తి చేశారు.
ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. నిజానికి రతన్ టాటా ఇలాంటి అభ్యర్థన చేయడం ఇదే మొదటిసారి. మూగ జీవులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈయనకు మూగ జీవాల పట్ల ఎంత ప్రేమ ఉందొ మనకు ఇట్టె అర్థమైపోతుంది.
రతన్ టాటా పెంపుడు శునకాల్లో ఒకటైన టిటోకి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల 2018 లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలస్‌లో అప్పటి ప్రిన్స్ చార్లెస్ నుంచి అందుకునే పురస్కారానికి కూడా వెళ్ళలేదు. జంతువులంటే ఆయనకు ఎంత ప్రేమ ఉందో ఈ ఒక్క ఉదాహరణ చాలు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment