సోమవారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో రూ.35 కోట్లతో ఏర్పాటు చేసిన రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న కొందరు హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు అని మహాత్మా గాంధీ చెబితే కొందరు మాత్రం మంచి వినొద్దు, మంచి మాట్లాడొద్దు, మంచి చూడొద్దు అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వైద్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చామన్నారు.
కమిట్మెంట్ లేకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎందుకు రోబో ఎక్విప్మెంట్ ఎందుకు తెస్తామన్నారు. ఈ అభివృద్ధి వారికి ఏనాడు కనిపించదు తమ సిబ్బంది కృషి పై ఒక్క ప్రశంస చేయరని ధ్వజమెత్తారు. పేదల పట్ల కమిట్ మెంట్‌తో సీఎం పని చేస్తున్నారని అన్నారు.
కొందరు హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడతారు.. గవర్నర్ పై హరీష్ రావు ఫైర్
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment