టీడీపీ నేతలకు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. తను వెయ్యి కోట్లు సంపాదించానని ఆరోపణలు చేశారని.. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన తండ్రి ఇచ్చిన ఆస్తి కంటే ఒక రూపాయి ఎక్కువగా సంపాదించలేదని ఆయన అన్నారు. ఈ విషయంలో తాను వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నాని.. దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని ఆయన ఛాలెంజ్ విసిరారు.
వైసీపీ కార్పొరేటర్లు లే అవుట్ లు వేస్తే దాంతో తనకేం సంబంధమని ఆయన ఫైర్ అయ్యారు. డాక్టర్ గా ఉన్న సోదరుడు అశ్విన్ వ్యాపారం చేసి సంపాదిస్తే తనకు అంటగట్టడం ఎంత వరకు కరెక్ట్ అని ఆయన నిలదీశారు. తనకు దానంలో ఐదు ఎకరాల స్థలం ఎక్కడుందో చూపించాలన్నారు. చైన్నైలో తాను కిరాయి ఇంట్లో చదువు కోసం ఉండాల్సి వచ్చిందన్నారు
టీడీపీ ఆరోపిస్తున్నట్టుగా తనకు 50 కోట్లు విలువ చేసే ఇల్లు ఎక్కడుందో చూపాలని.. చూపిస్తే.. తాను అక్కడే ఉంటానని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సిటీలో తనకు 80 ఎకరాలున్నాయని లోకేష్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తనకు అక్కడ కేవలం 13 ఎకరాలు మాత్రమే ఉందన్నారు అనిల్ కుమార్ యాదవ్
అందులో నుంచి కూడా అమ్మేశానని, తిరుగాళ్ళమ్మ గుడి దగ్గర మూడెకరాలు అమ్మేశానని అన్నారు. టీడీపీ సభల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ ఎందుకు కనిపించడం లేదని అనిల్ ప్రశ్నించారు. రూరల్ లో అక్రమాలన్నీ స్వాతిముత్యం కమలహాసన్ చేస్తున్నారని అజీజ్ చెప్పారని.. ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ అబద్దాలేనా.. అని ఆయన ప్రశ్నించారు.
ఈ స్వాతిముత్యం ఇప్పుడు పార్టీలో ఉన్నారో లేదో ఇప్పుడే చెప్పాలని డిమాండ్ చేశారు. ఓడిపోతానని తెలిసి రూరల్ లో పోటీ చేసిన అబ్దుల్ అజీజ్ ను పట్టించుకోకపోవడం గొంతుకోయడా.. లేక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సీఎం జగన్ రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం గొంతు కోయడమా.. అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ ప్రశ్నించారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment