Railway Recruitment 2022: ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా లెవల్ 2, 3, 4, 5 Posts
Railway Recruitment 2022: ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా లెవల్ 2, 3, 4, 5 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉన్నత విద్యార్హత ఉన్న అభ్యర్థులు
ప్రధానాంశాలు:
వెస్ట్రర్న్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2022
21 గ్రేడ్ సీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
సెప్టెంబర్ 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
Railways Jobs 2022: వెస్ట్రన్ రైల్వే స్పోర్ట్స్ కోటా కింది విభాగంలో 21 గ్రేడ్ సీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా లెవల్ 2, 3, 4, 5 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉన్నత విద్యార్హత ఉన్న అభ్యర్థులు గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లర్క్-కమ్-టైపిస్ట్ కేటగిరీలో నియమించబడే వ్యక్తులు ఆంగ్లంలో నిమిషానికి 30 పదాలు లేదా హిందీలో నిమిషానికి 25 పదాల టైపింగ్ వేగం కలిగి ఉండాలి.
నియామకం తేదీ నుంచి నాలుగు సంవత్సరాల వ్యవధిలో అతను టైపింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు అతని నియామకం తాత్కాలికంగా పరిగణిస్తారు. లెవల్ 4,5 కింద దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే లెవల్ 2, 3 కింద దరఖాస్తు చేయడానికి అభ్యర్థి 10+2 లేదా దానికి సమానమైన గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 5 నుంచి అధికారిక వెబ్‌సైట్ https://rrcwr.com/ ద్వారా ప్రారంభమవుతుంది. అక్టోబర్ 4 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ పోస్టులకు రాత పరీక్ష ఉండదు. స్పోర్ట్స్ ట్రయల్స్, స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌లో ప్రదర్శన ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు జనరల్, OBC కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించాలి. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వయోపరిమితి అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. అదే సమయంలో గరిష్ట వయోపరిమితిని 25 సంవత్సరాలుగా తెలిపారు. వయస్సు 1 జనవరి 2023 నుంచి లెక్కిస్తారు.
జీతం:
లెవల్ 2 కింద ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.19,900 నుంచి రూ. 63,200 వరకు పొందుతారు. లెవల్ 3 కింద ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం పొందుతారు. లెవల్ 4 కింద ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 25,500 నుంచి రూ.81,100 వరకు జీతం పొందుతారు. లెవల్ 5 కింద ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 వరకు జీతం ఉంటుంది.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment