Breaking

Search Here

08 July 2023

ఢిల్లీలో ఏం జరుగుతోంది? మార్పులుంటాయా?

 



ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ

9 ఏళ్ల మోడీ పాలన, సార్వత్రిక ఎన్నికలపై చర్చ

కేబినెట్ విస్తరణపైనా మోడీ ఫోకస్

కేంద్ర మంత్రివర్గంలోకి బండి?

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి?

ఈటలకు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి?

రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం

చర్చనీయాంశమైన రఘునందన్ ఢిల్లీ టూర్

ఆసక్తికరంగా ఈటల, జితేందర్ భేటీ

బీజేపీలో అనూహ్య పరిణామాలు


కేంద్ర కేబినెట్ సోమవారం భేటీ అయ్యింది. కొత్తగా నిర్మించిన ప్రగతి మైదాన్‌ లో ఈ సమావేశం జరిగింది. మంత్రి మండలితో ఫలప్రదమైన సమావేశం జరిగిందని మోడీ ట్వీట్ చేశారు. ఈ భేటీలో అనేక అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నామని అన్నారు. కానీ, ఫుల్ డీటెయిల్స్ మాత్రం ఆయన చెప్పలేదు. కరోనా పరిణామాల తర్వాత కేంద్ర మంత్రిమండలి భేటీ జరగడం ఇది రెండోసారి.


9 ఏళ్ల మోడీ పాలన, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు తదితర అంశాలపై కేబినెట్ లో చర్చలు జరిగాయి. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకు కేంద్రం సిద్ధమైందని ప్రచారం సాగుతున్న ఈ సమయంలో కేబినెట్ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలపైనా సమావేశంలో చర్చించినట్లు సమాచారం.


జులై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో తీసుకురానున్న కీలక బిల్లులపై కూడా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. మంత్రిమండలిలో మార్పులు, చేర్పులపైనా ఈ భేటీలోనే ప్రధాని మోడీ సంకేతాలు ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. 2019లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే మోడీ కేబినెట్ ను విస్తరించారు.


త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీలో కీలక మార్పులు ఉంటాయనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర నేతలు వరుసగా ఢిల్లీ పర్యటనలు పెట్టుకోవడం కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రివర్గంలోకి బండి సంజయ్ ను తీసుకుని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. అలాగే, ఈటలకు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి అప్పగిస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఏ క్షణమైనా ఆర్డర్స్ రావొచ్చని అంటున్నారు.


మరోవైపు, రఘునందన్ ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అలాగే, హైదరాబాద్ లో జితేందర్ రెడ్డి, ఈటల కలుసుకోవడం కూడా బీజేపీలో ఏదో జరుగుతోందనే సందేహాలను పెంచింది.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments