ఖమ్మంలో రాళ్లు,కత్తులతో కాంగ్రెస్,బీఆర్ఎస్ పరస్పర దాడి!
రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా పాలిటిక్స్ టర్న్ కావడంతో హీట్ పెరుగుతోంది. ఖమ్మం జనగర్జన తరువాత ఇక సై అంటే సై అన్నట్టుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలోనే ఖమ్మంలో ఈ రెండు పార్టీల నేతలు రాళ్లు, కత్తులతో పరస్పరంగా దాడికి పాల్పడ్డారు.
కామేపల్లి మండలం పండితాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో రెచ్చిపోయిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలపై కత్తులతో దాడికి దిగినట్టు సమాచారం. ఈ దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
అయితే పండితాపురంలో రెండురోజుల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఈక్రమంలోనే గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన మహేష్ గౌడ్ పై కత్తులతో, రాళ్లతో దాడి చేశారు. కాగా, గతంలో కూడా బీఆర్ఎస్ స్థానిక నేతలు మహేశ్ పై ఇదే విధంగా దాడికి పాల్పడ్డారని..అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఖమ్మం సభ విజయవంతం కావడంతోనే ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు మరోసారి దాడులకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment