రాహుల్ గాంధీ పై బీఆర్ఎస్ చేసిన కామెంట్స్ ను తెలంగాణ సీనియర్ నేత మల్లు రవి తిప్పికొట్టారు. పరిపక్వత లేని నేతలు బీఆర్ఎస్ వాళ్లని ఆయన విమర్శించారు. స్థితప్రజ్ఞత ఉన్న నేత రాహుల్ గాంధీ అని అన్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు రాహుల్ గాంధీకి ఏది మంచో.. ఏది చెడో.. బాగా తెలుసన్నారు.
ఎక్కడ ఎలా ప్రవర్తించాలో.. జయపజయాలను ఎలా స్వీకరించాలో.. అన్ని తెలిసిన నాయకులు రాహుల్ గాంధీ అని కొనియాడారు మల్లు రవి. త్యాగానికి, దేశసేవలకు అంకితమైన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గురించి బీఆర్ఎస్ నేతలు పరిపక్వత లేదని మాట్లాడడం వారి నీచ రాజకీయాలకు పరాకాష్ట అని మల్లు రవి ధ్వజమెత్తారు.
పరిపక్వత అంటే అడ్డగోలుగా అవినీతి చేయడమా.. ఇతర పార్టీ నాయకులను అడ్డగోలుగా గుంజుకొని అధికారం చేయడమా అని ప్రశ్నించారు. నియంతలాగా పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడమా.. అని నిలదీశారు. రాహుల్ గాంధీ ప్రజల కోసం పని చేస్తున్న నేత అని ఆయన దేశంలో కోట్లాది ప్రజల మనసులు గెలుచుకున్న నేత అని కొనియాడారు మల్లు రవి.
దేశాన్ని విద్వేషాల నుంచి ఐక్యత సాధించేందుకు 4 వేల కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన మహా మనిషి అని అన్నారు. అటువంటి గొప్ప నిస్వార్థ నేత గురించి పనికిరాని నాయకులు అడ్డగోలుగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు తిప్పికొడుతారని మల్లు రవి బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment