Breaking

Search Here

06 July 2023

ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం!

 


ఆదిలాబాద్ లో మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్  అవుతోంది. ఓ ఎమ్మెల్యే పుట్టిన రోజుల వేడుకలకు తప్పని సరిగా రావాలంటూ తన పదవీని అడ్డుపెట్టుకొని కిందిస్థాయి ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేయడమే అందుకు కారణం.


మున్సిపల్,మెప్మా సిబ్బంది బర్త్ డే వేడుకల్లో తప్పనిసరిగా పాల్గొనాలంటూ ఆయన జారీ చేసిన హుకుం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. కాగా, జూలై 4న ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజు. దీంతో ఆయన పుట్టిన రోజు వేడుకలకు ఆదిలాబాద్ మున్సిపల్, మెప్మా ఆధ్వర్యంలో వేడుకలు చేస్తున్నామని జూలై 3వ తేదీ మున్సిపల్ కమిషనర్ కింది స్థాయి ఎంప్లాయిస్ కు ఆదేశాలు జారీ చేశారు.


సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఆదేశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధి బర్త్ డే ను కమిషనర్ భుజాన ఎత్తుకొని చేయడం ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యల కంటే ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు ముఖ్యమా.. అని నిలదీస్తున్నారు.


అయితే గతంలో కూడా కేసీఆర్ బర్త్ డే కు రాలేదని బెల్లంపల్లి కమిషనర్ కింది స్థాయి ఉద్యోగులకు మెమోలు జారీ చేసిన ఇష్యూ కూడా పెద్ద దుమారాన్ని రేపింది.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments