IT Employees: చాట్‌జీపీటీ.. ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్న ఆర్టిఫిషియల్ టెక్నాలజీ చాట్‌బాట్. ఏఐ ఆధారిత సాకేంతికత విస్తరణకు ఇది బీజం వేసిందనే చెప్పాలి. చాట్‌జీపీటీ ఒక్కటే కాదు చాలా కంపెనీలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కోసం పని చేస్తున్నాయి. వాటితో ఎంత ఉపయోగం ఉందో అంతకంటే ఎక్కువ ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. ఏఐతో ఉద్యోగుల భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడింది. మనుషులను ఏఐ టెక్నాలజీ భర్తీ చేయనుందని, దీంతో మనుగడపైనే ప్రతికూల ప్రభావం పడుతుందని, దానిని అడ్డుకోవాలని ఎలాన్ మస్క్ సహా వందల మంది వ్యాపారవేత్తలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మీడియా రంగం నుంచి మొదలు కొని టెక్ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులను ఏఐ టెక్నాలజీ భర్తీ చేసే అవకాశం ఉందనే నివేదికలు ఉద్యోగులను కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.
అమెజాన్‌లో ₹1,999 లోపే బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రానిక్స్ & యాక్సిసరీలు
పీటర్ హెచ్ డయామండీ హోస్ట్ చేసిన మూన్షాట్స్ అండ్ మైండ్సెట్ పాడ్ కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న స్టెబిలిటీ ఏఐ సీఈఓ ఎమాడ్ మోస్టాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలపై బాంబు పేల్చారు. రాబోయే ఐదేళ్లలో మనుషులు ప్రోగ్రామ్‌ను డిజైన్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ స్వయంగా కోడింగ్‌ను రూపొందిస్తున్నాయన్నారు. టెక్ రంగానికి కావాల్సిన కోడ్‌లను ప్రామాణికంగా, మరింత ఖచ్చితత్వంతో అందించేందుకు సహాయపడతాయని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు జనరేటివ్ ఏఐ సైతం తనదైన ముద్ర వేస్తుందని చెప్పారు.
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ గిట్ హబ్‌లో 41 శాతం కోడ్‌లను చాట్ జీపీటీ తయారు చేసినవేనటా. ఐదేళ్లలో ప్రోగ్రామర్ల అవసరం ఉండదని, దీనితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్ ప్రోగ్రామర్లకు ముప్పు ఎక్కువగా ఉందన్నారు ఏఐ సీఈఓ. 2024 చివరి నాటికి అందిరి ఫోన్లలో చాట్ జీపీటీ అందుబాటులోకి వస్తుందని, దానిని వినియోగించాలంటే ఇంటర్నెట్ అవసరం లేదన్నారు. ఇంటర్నెట్ లేకుండానే కావావాల్సిన పనులన్నీ చాట్ జీపీటీతో పూర్తి చేసుకోవచ్చని, ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చూడండని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను అందరూ వినియోగించుకునేలా చూడాలని స్టెబిలిటీ ఏఐ సీఈఓ పేర్కొన్నారు. ఆడియో, వీడియో, డీఎన్ఏ, కెమికల్ రియాక్షన్స్, లాంగ్వెజ్ ఇలా అన్నీ ఇంటిగ్రెటెడ్ సొసైటీ ఓఎస్ పద్ధతి ఆధారంగా ఒక మోడల్ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. చాట్ జీపీటీ వేగంగా విస్తరిస్తున్న తీరును వివరించారు ఏఐ సీఈఓ. భవిష్యత్తులో అన్నింటికీ ఈ టెక్నాలజీనే ఉపయోగించే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment