ద్వంద్వ వైఖరి వద్దు.. పాక్ ప్రధానికి వినబడేలా భారత ప్రధాని స్ట్రాంగ్ మెసేజ్
న్యూఢిల్లీ:
ఉగ్రవాదం అనేది ఒక ప్రాంతానికే కాదు.. యావత్ ప్రపంచ శాంతికి ప్రమాదకారి. అలాంటి ఉగ్రవాద కట్టడిలో ద్వంద్వ వైఖరి అసలు పనికిరాదు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను విమర్శించడానికి కూటమి వెనుకాడకూడదు.. అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టి సందేశం ఇచ్చారు.
మంగళవారం జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సులో(వర్చువల్)కి భారత్ అధ్యక్షత వహించింది. మన దేశం తరపున ప్రధాని మోదీ ఈ సదస్సులో ప్రసంగించారు. ఈ భేటీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే.. కజకస్థాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్(కొత్త సభ్యదేశంగా చేరింది) ప్రతినిధులు సైతం పాల్గొన్నారు.
ఎస్సీవో సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ.. నిర్ణయాత్మకమైన చర్యల ద్వారా ఉగ్రవాదం, టెర్రర్ ఫైనాన్సింగ్‌లకు అడ్డుకట్ట వేయాలని పిలుపు ఇచ్చారాయన. పరస్సర సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని సభ్య దేశాలను ఉద్దేశించి పేర్కొన్నారాయన. ఉగ్రవాదంపై సమిష్టింగా మనమంతా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ద్వంద్వ వైఖరి ఏమాత్రం సరికాదంటూ దాయాది దేశం పాక్‌కు చురకలంటించారాయన. ఇక ఇదే వేదిక నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సంక్షోభాలు.. సమస్యలపైనా ప్రధాని మోదీ చర్చించారు.
1996లో చైనా, కజకస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజికిస్తాన్‌ల పంచ దేశాల కూటమితో షాంగై ఫైవ్ ఆవిర్భవించింది. దానికి కొససాగింపుగా ఏర్పడిందే SCO. ప్రస్తుతం ఇందులో తొమ్మిది సభ్య దేశాలు ఉన్నాయి.
2005 నుంచి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో పరిశీలన దేశంగా భారత్ కొనసాగుతూ వస్తోంది. అయితే.. 2017లో ఆస్తానాలో జరిగిన సదస్సు ద్వారా పూర్తి సభ్యత్వ దేశంగా భారత్ మారింది.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment