Breaking

Search Here

06 July 2023

కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ విచిత్రంగా ప్రవర్తిస్తోంది!

 


కాంగ్రెస్ పై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కాని హామీలిస్తుందన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ విచిత్రంగా ప్రవర్తిస్తుందని ఆయన విమర్శించారు.


బీఆర్ఎస్ ను గద్దె దింపాలనే కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే బీజేపీ బలోపేతం అవ్వడానికి కారణమని ఆయన వివరించారు. నాలుగు వేల పెన్షన్ ను కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎందుకివ్వడం లేదని గుత్తా నిలదీశారు.


దేశ బడ్జెట్  సగం ఇచ్చినా కాంగ్రెస్ హామీలు సాధ్యపడవని విమర్శించారు. బీజేపీని కేంద్రంలో గద్దె దింపేందుకు కాంగ్రెస్ సమ్మతంగా లేదన్నారు. రాహుల్ గాంధీ సమక్షంలోనే ఖమ్మం సభలో కాంగ్రెస్ కుమ్ములాటలు బయటపడ్డాయని గుత్తా అన్నారు.


బీజేపీ వ్యతిరేక శక్తులు కేసీఆర్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ లను ప్రజలు నమ్మే పిరిస్థితుల్లో లేరని అన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments