Jr NTR Flexi: ఎన్టీఆర్ ప్లెక్సీలపై మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
Jr NTR Flexi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. అయితే ఇప్పటికే ఆ ఫ్లెక్సీలపై ఆయన అభిమానులు క్లారిటీ ఇచ్చారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే దామచర్ల ఈ ఫ్లెక్సీలపై సంచలన
Jr NTR Flexi: ప్రకాశం జిల్లా (Prakasam District)లో రాజకీయ దుమారానికి కారణమైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ (Jr NTR Flexi) ల పై ఒంగోలు (Ongole) మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ (Dhamacharla Janardhan) స్పందించారు. ఒంగోలులోని టిడిపి కార్యాలయం (Ongole TDP Office) లో దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ... ఒంగోలు నగరంలో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే ఇందుకు గల కారణాలను వెలికి తీశామన్నారు. త్రోవగుంట పరిధిలో పనిచేస్తున్న అఫ్రిది అనే వాలంటీర్, త్రోవగుంట ఒకటవ డివిజన్ అధ్యక్షుడు సాంబశివరావులు ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్లు గుర్తించామన్నారు
తమకు దక్కిన సీసీ ఫుటేజ్ ఆధారంగా అసలు ఈ విషయంపై పూర్తి ఆధారాలు తమకు దక్కాయన్నారు. జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో, తెలుగు తమ్ముళ్ళ దృష్టిని మరల్చేందుకు వైసీపీ పన్నిన కుట్రగా తాను భావిస్తున్నానన్నారు. అంతేకాకుండా ఈ ఫ్లెక్సీలను కట్టినటువంటి సాయి అనే కుర్రవాడు తమకు పూర్తి విషయాలను వెల్లడించారన్నారు.
తనకు 4500 ఫోన్పే ద్వారా నగదు బదిలీ చేసి, ముసుగులు ధరించిన ఇరువురు వ్యక్తులు తనను సంప్రదించినట్లు, అయితే ముసుగు ధారణ పై ప్రశ్నించిన క్రమంలో, ఫ్లెక్సీల వాసన తమకు పడదని సదరు వ్యక్తులు తెలిపారని సాయి తెలిపారు. ప్రకాశం జిల్లాలో ప్రశాంత వాతావరణ కలిగించే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసంమన్నారు. జిల్లా పోలీస్ శాఖ సైతం ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాము పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు, ముందుగా తమకు వచ్చిన సందేహాలను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులతో పంచుకున్నామన్నారు. ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు సైతం ఈ విషయంపై స్పందించారని, ప్రశాంతత వాతావరణానికి భంగం కలిగించేందుకు చొరవ చూపిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
అంతే కాకుండా ఈ ఫ్లెక్సీల రగడపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. జిల్లాలో విజయవంతంగా జరుగుతున్న నారా లోకేష్ పాదయాత్రను తట్టుకోలేక, పలువురు వైసీపీ నేతలు ఇటువంటి కార్యక్రమాలకు వడిగట్టారన్నారు. వైసిపి అధిష్టానం సైతం వీరికి మద్దతు పలికినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment