Omicron Variant: 111కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ.. |
Omicron Variant: 111కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ..
దేశంలో ఒమిక్రాన్ కేసులు మరింత వేగం విస్తరిస్తున్నాయి. ఇప్పటికే 111 కి చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు విస్తరించిందని..
Omicron Variant: 111కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ..
దేశంలో ఒమిక్రాన్ కేసులు మరింత వేగం విస్తరిస్తున్నాయి. ఇప్పటికే 111 కి చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు విస్తరించిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32, ఢిల్లీలో 22 కేసులు బయటపడినట్లు తెలిపింది. ఈ తర్వాత రాజస్తాన్‌లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8 గుజరాత్‌లో 5 కేరళలో 5 కేసులు వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, బెంగాల్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదూనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో కోవిడ్ పరిస్థుతలపై కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక అంశాలను వెల్లడించారు. గతంలో బయటపడిన డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారి కోవిడ్ కేసుల్లో 2.4 శాతం ఈ వేరియంట్ కేసులేనని తెలిపారు.
ఆఫ్రికా దేశాల నుంచి వచ్చినవారి నుంచి ఈ వేరియంట్ మన దేశంలోకి వచ్చేసింది. ఈ నెల మొదటి వారంతో మన దేశంలోకి ప్రవేశించిన ఒమిక్రాన్ ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. బయటి వచ్చిన వారికి నిర్ధారణ పరీక్షల ద్వారా సేకరించిన నమూనాలకు జీనోమ్ సీక్వెన్స్‌కు పంపిన తర్వాత 3 రోజులకు కానీ ఫలితాలు రావడం లేదు.. ఈలోగా వారి నుంచి మరి కొందరికి ఈ వేరియంట్ వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది.
Manasa Varanasi: మిస్ వరల్డ్ పోటీల్లో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడిన మిస్ ఇండియా.. తాత్కాలికంగా పోటీల వాయిదా..
స్ ఇండియా-2020 మానస వారణాసి కరోనా బారిన పడింది. ఆమెతో పాటు వివిధ దేశాలకు చెందిన పలువురు అందగత్తెలు కొవిడ్ బారిన పడడంతో మిస్ వరల్డ్ - 2021 పోటీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.
Manasa Varanasi: మిస్ వరల్డ్ పోటీల్లో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడిన మిస్ ఇండియా.. తాత్కాలికంగా పోటీల వాయిదా..
మిస్ ఇండియా-2020 మానస వారణాసి కరోనా బారిన పడింది. ఆమెతో పాటు వివిధ దేశాలకు చెందిన పలువురు అందగత్తెలు కొవిడ్ బారిన పడడంతో మిస్ వరల్డ్ – 2021 పోటీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారం మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే నిన్న (డిసెంబర్ 16) ప్యూర్టోరికోలో జరగాల్సి ఉంది. అయితే ఫైనల్‌కు ముందే మానసతో పాటు మరికొందరు పోటీదారులు, సిబ్బందితో కలిపి మొత్తం 17 మంది కొవిడ్ బారిన పడ్డారు. దీంతో ముందు జాగ్రత్తగా అందాల పోటీలను వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రాబోయే 90 రోజుల్లో ప్యూర్టో రికోలోని జోస్ మిగ్యుల్ అగ్రెలాట్ కొలిజియంలో మిస్ వరల్డ్ పోటీల ముగింపు షెడ్యూల్ చేస్తామని ఈవెంట్ ఆర్గనైజర్లు ప్రకటించారు.
కాగా 23 ఏళ్ల మానస వారణాసి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మిస్ ఇండియా- 2020 పోటీల్లో విజేతగా నిలిచింది. తద్వారా 70వ ప్రపంచ సుందరి పోటీలకు అర్హత సాధించింది. అయితే ఇంతలోనే కరోనా బారిన పడింది. కాగా ఈ అందాల రాణికి మన భాగ్యనగరంతోనూ అనుబంధం ఉంది. హైదరాబాదులో ఎఫ్ఐఐటీ జేఈఈలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ చదివింది.
Omicron variant: తెలంగాణలో ఒమిక్రాన్ వణుకు.. హైదరాబాద్‌లో 2 యాక్టివ్ కేసులు
Visakhapatnam: ఆశ్రమంలో ఆవుల వరుస మరణాల కలకలం.. కారణాలపై ఆరా తీస్తున్న అధికారులు
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment