Breaking

Search Here

15 December 2021

IIIT- Delhi: ఫాస్ట్ రిటైలింగ్ భాగస్వామ్యంతో ఐఐఐటీ ఢిల్లీ స్కాలర్​షిప్​.. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం

IIIT- Delhi: ఫాస్ట్ రిటైలింగ్ భాగస్వామ్యంతో ఐఐఐటీ ఢిల్లీ స్కాలర్​షిప్​
IIIT- Delhi: ఫాస్ట్ రిటైలింగ్ భాగస్వామ్యంతో ఐఐఐటీ ఢిల్లీ స్కాలర్​షిప్​.. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం

 

IIIT- Delhi: ఫాస్ట్ రిటైలింగ్ భాగస్వామ్యంతో ఐఐఐటీ ఢిల్లీ స్కాలర్​షిప్​.. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం


IIIT- Delhi: ఫాస్ట్ రిటైలింగ్ భాగస్వామ్యంతో ఐఐఐటీ ఢిల్లీ స్కాలర్​షిప్​.. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం


ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) నిరుపేద విద్యార్థుల కోసం స్కాలర్​షిప్​, ఇంటర్న్​షిప్​లను ప్రకటించింది. పబ్లిక్ జపనీస్ మల్టినేషనల్​ రిటైల్ హోల్డింగ్ కంపెనీ ఫాస్ట్ రిటైలింగ్​ సహకారంతో ఈ స్కాలర్​షిప్​ను ఆఫర్​ చేస్తోంది.


IIIT- Delhi:  ప్రతిభ ఉన్నా సరే ఆర్థిక పరిస్థితి కారణంగా అనేక మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. అటువంటి విద్యార్థులను ఉన్నత విద్యలో ప్రోత్సహించేందుకు అనేక విద్యాసంస్థలు, స్వచ్చంద సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా, ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) నిరుపేద విద్యార్థుల కోసం స్కాలర్​షిప్​, ఇంటర్న్​షిప్​లను ప్రకటించింది. పబ్లిక్ జపనీస్ మల్టినేషనల్​ రిటైల్ హోల్డింగ్ కంపెనీ ఫాస్ట్ రిటైలింగ్​ సహకారంతో ఈ స్కాలర్​షిప్​ను ఆఫర్​ చేస్తోంది. విద్యార్థులకు, ముఖ్యంగా సమాజంలోని బలహీన ఆర్థిక వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం ఫాస్ట్ రిటైలింగ్ ఎడ్యుకేషనల్ స్పాన్సర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది.

Jobs in LTC: ల్యాబొరేట‌రీస్ టెక్స్‌టైల్ క‌మిటీలో ఉద్యోగాలు.. జీతం రూ. 15,000.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌



విద్యార్థులను రేపటి గ్లోబల్ లీడర్‌లుగా మార్చడంలో సహాయపడటానికి ఈ ప్రోగ్రామ్​ను డిజైన్​ చేసినట్లు తెలిపింది. బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థులకు పూర్తి నాలుగేళ్ల వ్యవధి లేదా మాస్టర్స్ డిగ్రీ విద్యార్థులకు రెండేళ్ల వ్యవధికి అయ్యే అన్ని ఖర్చులను భరిస్తుంది. ప్రతి ఏడాది మొత్తం ఐదుగురు నిరుపేద విద్యార్థులకు ఎంపిక చేసి పూర్తి ట్యూషన్ ఫీజు, సంబంధిత ఖర్చులను భరిస్తుంది. స్పాన్సర్‌షిప్‌తో పాటు జపనీస్, సంస్కృతి భాషలపై అధ్యయనానికి UNIQLO ఇండియాలో ఇంటర్న్‌షిప్​ అవకాశం కూడా కల్పిస్తోంది. ఇంటర్న్​షిప్​ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు జపాన్‌లో ఫాస్ట్ రిటైలింగ్ లేదా భారతదేశంలోని UNIQLO సంస్థలో ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తారు.

RRB Group D: ఆర్​ఆర్​బీ గ్రూప్​ డీ అప్లికేషన్ లింక్ యాక్టివేట్.. ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకోండి!

రిటైలింగ్​ సహకారంతో స్కాలర్​షిప్​..

ప్రోగ్రామ్‌కు ఎంపికైన ఐఐఐటీ -ఢిల్లీ మూడవ సెమిస్టర్ విద్యార్థి ఆర్యమన్ మిశ్రా మాట్లాడుతూ “ఫాస్ట్ రిటైలింగ్ ఇంటర్న్​​షిప్​కు ఎంపికవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. నాకు వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకొని జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకుంటారు. ఫాస్ట్ రిటైలింగ్ నా అకడమిక్​ ఫీజు మొత్తం చెల్లిస్తూ ఉన్నత విద్యలో ప్రోత్సహిస్తోంది.” అని తెలిపారు.


ఈ ప్రోగ్రామ్​ విజన్ గురించి ఫాస్ట్ రిటైలింగ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఎడ్యుకేషనల్ స్పాన్సర్‌షిప్ ప్రోగ్రామ్ ఇన్‌ఛార్జ్ నోరియాకి కోయామా మాట్లాడుతూ, “UNIQLO భారతదేశంలోకి ప్రవేశించిన మొదటి రోజు నుండి, మా రిటైల్ వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి సారించాం. ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించడం ద్వారా వారిని ప్రపంచ వేదికపై బిజినెస్​ లీడర్లుగా మార్చడానికి సహాయం చేస్తుంది.”అని అన్నారు. షాస్ట్​ రిటైరింగ్​తో భాగస్వామ్యం గురించి ఐఐఐటీ -ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ రంజన్ బోస్ మాట్లాడుతూ, “ఐఐఐటీలో చదువుతున్న ప్రతిభగల నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించడానికి ఫాస్ట్ రిటైలింగ్ ముందుకు రావడం అభినందనీయం. విద్యార్థులను మార్కెట్ లీడర్​గా తయారు చేసేందు మా భాగస్వామ్యం పనిచేస్తుంది.”అని పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments