Pushpa movie review: అల్లు అర్జున్ ‘పుష్ప’ రివ్యూ.. తగ్గేదే లే అంటూనే తగ్గాడబ్బా..! |
Pushpa movie review: అల్లు అర్జున్ ‘పుష్ప’ రివ్యూ.. తగ్గేదే లే అంటూనే తగ్గాడబ్బా..!
‘పుష్ప’ మూవీ రెండో పార్ట్ టైటిల్ రివీల్ (Twitter/Photo)
Pushpa movie review: చాలా రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న పేరు పుష్ప (Pushpa movie review). ఓ రకంగా చెప్పాలంటే 2021లో ఇదే అత్యంత భారీ బడ్జెట్ సినిమా. ఏడాది చివర్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌తో థియేటర్స్‌పై దండయాత్రకు వచ్చాడు పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. మరి పుష్ప అంచనాలు అందుకుందా లేదా చూద్దాం..
నటీనటలు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు
దర్శకుడు: సుకుమార్
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా
సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R
లిరిసిస్ట్: చంద్రబోస్
చాలా రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న పేరు పుష్ప. ఓ రకంగా చెప్పాలంటే 2021లో ఇదే అత్యంత భారీ బడ్జెట్ సినిమా. ఏడాది చివర్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌తో థియేటర్స్‌పై దండయాత్రకు వచ్చాడు పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. మరి పుష్ప అంచనాలు అందుకుందా లేదా చూద్దాం..
కథ:
పుష్ప రాజ్ (అల్లు అర్జున్) ఎర్రచందనం స్మగ్లర్. కూలీగానే జీవితం మొదలుపెట్టినా ఒకడి కింద పని చేయడం అనేది ఈయనకు నచ్చదు. అందుకే చేసే ప్రతీ పనిలోనూ వాటా దారుడిగానే ఉంటాడు. చాలా తక్కువ సమయంలోనే కొండా రెడ్డి బ్రదర్స్ (అజయ్ ఘోష్, ధనుంజయ)తో కలిసి చాలా ఎత్తుకు ఎదుగుతాడు పుష్ప. ఈ క్రమంలోనే ఆయనకు పోలీస్ ఆఫీసర్ గోవిందప్ప (శత్రు)తో గొడవలు అవుతుంటాయి. అయినా కూడా తన తెలివి తేటలతో పుష్ప రేంజ్ మారిపోతుంది. అదే సమయంలో శ్రీవల్లి (రష్మిక మందన్న)తో ప్రేమలో పడతాడు పుష్ప. జీవితం అలా సాగిపోతున్న సమయంలోనే మంగళం శ్రీను (సునీల్) పుష్ప జీవితంలోకి ఎంట్రీ ఇస్తాడు. స్మగ్లింగ్ విషయంలోనే అతడితో వైరం పెరిగిపోతుంది. చివరికి సిండికేట్ కింగ్ అయిపోతాడు పుష్ప. తిరుగు లేకుండా సాగుతున్న పుష్ప జైత్రయాత్రకు బ్రేకులు వేయడానికి వస్తాడు భన్వర్ సింగ్ షఖావత్ (ఫహాద్ ఫాజిల్). ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది అసలు కథ..
కథనం:
పుష్ప.. చాలా రోజులుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పేరు. పైగా అల్లు అర్జున్ మేకోవర్ చూసిన తర్వాత.. ఏదో తెలియని ఒక వైబ్రేషన్. ఇవన్నీ కలిపి థియేటర్లో సెలబ్రేషన్ చేసుకుందామని వెళ్ళిన ప్రేక్షకులకు బన్నీ ఆ సర్‌ప్రైజ్ అలాగే ఇచ్చాడు. అనుకున్నట్లుగానే అల్లు అర్జున్ పుష్ప రాజ్ క్యారెక్టర్ కోసమే పుట్టాడు అనిపించింది. ఆయన తప్ప ఇంకెవరు ఈ క్యారెక్టర్ చేయలేరేమో అనేలా జీవించాడు బన్నీ. దీనమ్మ తగ్గేదే లే.. బన్నీ కనిపించిన ప్రతి సీన్ అరుపులే. దానికి తగ్గట్టుగా సరైన సన్నివేశాలు.. బలమైన కథ కూడా ఉండుంటే.. బాక్సాఫీస్ దగ్గర పుష్ప నిజంగానే మీసం మెలేసి తగ్గేదే లే అనేవాడు. కానీ హీరో ఎలివేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి.. కథను ఎందుకో సుకుమార్ పక్కదారి పట్టించినట్టుగా అనిపించింది. దానికి తోడు సినిమా లెంత్ కూడా విలన్ గా మారింది. మూడు గంటల నిడివి పుష్ప సినిమాకు ఒక రకంగా శాపం. అరే ఈ సీన్ అదిరిపోయిందిరా.. అనుకునే లోపు మరో నాసిరకం సన్నివేశం వస్తుంది. స్లో నేరేషన్ కూడా పుష్ప సినిమాకు మైనస్.. కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. కొన్ని సన్నివేశాలు.. మరీ ముఖ్యంగా బన్నీ, రష్మిక మధ్య వచ్చే సీన్స్ బలవంతంగా ఇరికించారు అనిపించింది. ఫస్టాఫ్‌లో చాలా సన్నివేశాలు బోర్ కొట్టించాయి. ముఖ్యంగా స్లో స్క్రీన్ ప్లే కూడా పుష్పకు శాపమే. ఎంతసేపు బన్నీ ఎదిగాడు.. ఎదుగుతున్నాడనే విషయాన్ని ఫోకస్ చేసాడు కానీ ఎలా ఎదిగాడు అనే బలమైన సన్నివేశాలు సినిమాలో కనిపించలేదు. పోలీస్ చెక్‌పోస్టులను దాటే సన్నివేశాలు కూడా చాలా నీరసంగానే సాగాయి. కేవలం బన్నీ మాస్ ఎలివేషన్స్ మాత్రమే బాగా హైలైట్ అయ్యాయి. మంగళం శ్రీను కారెక్టర్ కూడా అంతగా హైప్ ఇచ్చారు కానీ అది కూడా తేలిపోయింది. సినిమాలో చాలా మంది కారెక్టర్స్‌ను సుకుమార్ ఎందుకో పర్ఫెక్టుగా యూజ్ చేసుకోలేదు. రష్మిక మందన్న పాత్ర కూడా అంతే. అక్కడక్కడా అదిరిపోయే సన్నివేశాలు మినహాయిస్తే పుష్ప అంతగా ఆకట్టుకోవడం కష్టమే. పైగా అంచనాలు పెట్టుకుని వెళ్తే తగ్గావబ్బా అనిపిస్తాడు పుష్ప. తగ్గేదే లే అంటూనే చాలా చోట్ల తగ్గిపోయాడు పుష్ప రాజ్.
నటీనటులు:
నటన పరంగా అల్లు అర్జున్ కి తిరుగులేదు.. పుష్ప కోసం ప్రాణం పెట్టాడు. రష్మిక మందన్న పర్లేదు.. ఆమె పాత్ర అనుకున్నంతగా పండలేదేమో అనిపిస్తుంది. బన్నీ పక్కనుండే పాత్రలో జగదీష్ అనే కొత్త నటుడు బాగా చేశాడు.. సునీల్ కొత్తగా ఉన్నాడు.. అనసూయ ఆకట్టుకుంది. ఫహాద్ ఫాజిల్ చివర్లో ఎంట్రీ ఇచ్చాడు.. ఉన్నంత సేపు అల్లాడించాడు. ఆయన పాత్ర సెకండ్ పార్ట్‌లో ఎక్కువగా ఉంటుందని అర్థమైంది. ఇక అజయ్ ఘోష్, అజయ్, ధనుంజయ్ లాంటి నటులు బాగానే నటించారు.
టెక్నికల్ టీమ్:
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు బాగున్నాయి కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ చాలా వీక్ అనిపిస్తుంది. ముఖ్యంగా చాలా సన్నివేశాలు అలాగే ఉంచేసారు. అవి తీసేసినా కూడా సినిమాపై పెద్దగా ప్రభావం పడదు. ఫస్టాఫ్, సెకండాఫ్‌లో కలిపి అలాంటి సన్నివేశాలు 25 నిమిషాలకు పైగానే ఉన్నట్లు అనిపించింది. 3 గంటల నిడివి ఉన్నపుడు సినిమాలో అంతే బలమైన ఎమోషన్ కూడా ఉండాలి. కానీ పుష్పలో అదే మిస్ అయినట్లు అనిపించింది. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. క్యూబా వర్క్ సూపర్. దర్శకుడిగా సుకుమార్ కష్టంతో పాటు కన్ఫ్యూషన్ కూడా కనిపించింది.. అయితే క్లైమాక్స్ లో రెండో భాగంకి కావాల్సిన సెటప్ సెట్ చేసి పెట్టాడు. అల్లు అర్జున్ కోసమే ఈ సినిమా చేసానంటే ఏమో అనుకున్నారు కానీ కేవలం ఆయన మాత్రమే సినిమాలో కనిపించాడు.. కథ తక్కువే కనిపించింది.
చివరగా ఒక్కమాట:
ఓవరాల్‌గా పుష్ప.. అక్కడక్కడా తగ్గావబ్బా..
రేటింగ్: 2.75/5
Very Good Bro
ReplyDeleteHi
Delete