Breaking

Search Here

17 December 2021

AP Jobs: ఏపీలో ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ అర్హతతో Tech Mahindraలో ఉద్యోగాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

 AP Jobs: ఏపీలో ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ అర్హతతో Tech Mahindraలో ఉద్యోగాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

AP Jobs: ఏపీలో ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ అర్హతతో Tech Mahindraలో ఉద్యోగాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
AP Jobs: ఏపీలో ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ అర్హతతో Tech Mahindraలో ఉద్యోగాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ఏపీలో ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ అర్హతతో Tech Mahindraలో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ ఇలా

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఎల్లుండి మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. టెక్ మహింద్రా (Tech Mahindra) సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలో వరుసగా జాబ్ మేళా (Job Mela) లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో జాబ్ మేళా(Job Mela)కు సంబంధించి APSSDC ప్రకటన చేసింది. ఈ నెల 18న చిత్తూరులో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు APSSDC ప్రకటించింది. ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహింద్రా (Tech Mahindra) సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు APSSDC తన ప్రకటనలో పేర్కొంది.


ఖాళీలు, విద్యార్హతల వివరాలు..

ఈ ప్రకటన ద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు.

-గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్/బీటెక్ చేసిన వారి కోసం 50 ఖాళీలు ఉన్నాయి. ఈ విభాగంలో ఎంపికైన వారికి ఏడాదికి రూ. 1.8 లక్షల నుంచి రూ. 2.8 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. ఈ విభాగంలో ఎంపికైన వారు చెన్నైలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు హిందీ తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

10th class qualification jobs: ప‌దో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో ఉద్యోగాలు.. జీతం రూ.25,500.. అప్లికేష‌న్ ప్రాసెస్‌


-ఇంటర్/డిగ్రీ, బీటెక్ చేసిన వారి కోసం మరో 50 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ విభాగంలో ఎంపికైన వారికి నెలకు రూ.1.64 లక్షల వేతనం రూ. 12 వేల అలవెన్స్ తో పాటు ఇతర ఇన్సెంటీవ్స్ ఉంటాయి. అభ్యర్థులు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. తమిళం వచ్చి ఉండాలి.

BECIL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. బీఈసీఐఎల్‌ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్


ఇతర వివరాలు..

అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి.

ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల సర్టిఫికేట్లు, ఆధార్ జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలి.

అభ్యర్థులు ఇతర వివరాలకు 9014707897, 7799300659 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments