ESIC Recruitment 2021: ఈఎస్ఐసీలో 1,120 ఉద్యోగాలు.. జీతం రూ.56,100.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ |
ESIC Recruitment 2021: ఈఎస్ఐసీలో 1,120 ఉద్యోగాలు.. జీతం రూ.56,100.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
ఈఎస్ఐసీలో ఉద్యోగాలు
ESIC Recruitment 2021: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజీలో పలు పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా ఈఎస్ఐసీలో 1120 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ - 2 (అల్లోపతి) పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుకు డిసెంబర్ 31, 2021 వరకు అవకాశం ఉంది.
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Employees' State Insurance Corporation) మెడికల్ కాలేజీలో పలు పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా ఈఎస్ఐసీలో 1120 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ (Insurance Medical Officer) గ్రేడ్ - 2 (అల్లోపతి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అప్లై చేయానుకొన్న అభ్యర్థులకు గరిష్ఠ వయసు 35 ఏళ్లు మించకూడదు. అప్లికేషన్ ప్రాసెస్, నోటిఫికేషన్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.in/recruitments ను చూడాలి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 జీతం అందిస్తారు. దరఖాస్తుకు డిసెంబర్ 31, 2021 వరకు అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు..
పోస్టుపేరు
ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ - 2 (అల్లోపతి)
అర్హతలు
దరఖాస్తు చేసుకొనే వారు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్న్‌షిప్ పూర్తి చేయని అభ్యర్థులు రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఖాళీలు
1,120
పరీక్ష విధానం..
అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ అబ్జెక్టీవ్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 200 మార్కులు ఉంటాయి. రెండు సెక్షన్‌లు ఉంటాయి. సెక్షన్-1లో 100 మార్కులు, సెక్షన్-2లో 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు ఉంటుంది.
విభాగం సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
సెక్షన్- జనరల్ మెడిసిన్ అండ్ పీడియాట్రిక్స్ 80+20 ప్రశ్నలు 100
సెక్షన్- సర్జరీ, గైనకాలజీ అండ్ అబ్‌స్టెట్రిక్స్ ప్రివెంటీవ్ అండ్ సోషల్ మెడిసిన్ 34+33+33 ప్రశ్నలు 100
ఎంపిక విధానం..
Step 1: ముందగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
Step 2: అనంతరం రాత పరీక్ష నిర్వహిస్తారు.
Step 3: రాత పరీక్షలో పాసైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
Step 4: ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన వారికి పోస్టింగ్ ఇస్తారు.
UPSC Preparation Tips: యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా?.. అయితే ఈ చిట్కాలతో విజయం సాధించండి.
దరఖాస్తు విధానం..
Step 1: దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో జరుగుతుంది.
Step 2: ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.in/recruitments ను సందర్శించాలి.
Step 3: అనంతరం ESIC Hrqs, New Delhi విభాగంలో నోటిఫికేషన్ చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Visakhapatnam: విశాఖపట్నంలో 59 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ విధానం
Step 4: అర్హతలు ఉన్నవారు అనంతరం అప్లై ఆన్‌లైన్‌లోకి వెళ్లి దరఖాస్తుకు అవసరమైన సమాచారం అందించాలి.
Step 5: దరఖాస్తు పూర్తయిన అనంతరం రూ.500 పరీక్ష ఫీజు చెల్లించాలి.
Step 6: అప్లికేషన్ పూర్తయిన తరువాత సబ్‌మిట్ (Submit) చేయాలి.
Step 7: దరఖాస్తు ఫాం ఒక కాపీని ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
Step 8: దరఖాస్తుకు డిసెంబర్ 31, 2021 వరకు అవకాశం ఉంది.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment