రోనా థార్డ్ వేవ్‌పై అప్రమత్తమైన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ |
Coronavirus: కరోనా థార్డ్ వేవ్‌పై అప్రమత్తమైన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ.. హరీష్ రావు కీలక ఆదేశాలు..
Coronavirus: కరోనా మహమ్మారి ఒమిక్రాన్ రూపంలో మరోసారి పంజా విసరడానికి సిద్ధమవుతోంది. సౌతాఫ్రికాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వెరియంట్ ప్రస్తుతం ప్రపంచమంతా విస్తరిస్తోంది...
Coronavirus: కరోనా థార్డ్ వేవ్‌పై అప్రమత్తమైన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ.. హరీష్ రావు కీలక ఆదేశాలు..
Coronavirus: కరోనా మహమ్మారి ఒమిక్రాన్ రూపంలో మరోసారి పంజా విసరడానికి సిద్ధమవుతోంది. సౌతాఫ్రికాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వెరియంట్ ప్రస్తుతం ప్రపంచమంతా విస్తరిస్తోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య పరిమితంగా ఉన్నప్పటికీ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా కనిపిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తవుతున్నాయి. కరోనా థార్డ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం కూడా చర్యలు ప్రారంభించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా థార్డ్ వేవ్ వస్తే థీటుగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
ఈ విషయమై మంగళవారం తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒమిక్రాన్ రూపంలో థార్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్దం చేయాలని, ప్రపంచ వ్యాప్త కరోనా పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అలాగే 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సౌకర్యం సిద్దం చేయాలి అని అధికారులకు మంత్రి సూచించారు. ఇక ప్రజలు సైతం స్వీయ నియంత్రణ పాటించాలని తెలిపిన మంత్రి.. ప్రజలు మాస్కులు ధరించాలని, రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రెండో డోసుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment