Breaking

Search Here

16 December 2021

PRC Meeting: తెగని పీఆర్‌సీ పంచాయితీ.. పట్టువీడని ఉద్యోగ సంఘాలు.. రేపు కూడా చర్చలు..

తెగని పీఆర్‌సీ పంచాయితీ.. పట్టువీడని ఉద్యోగ సంఘాలు.. రేపు కూడా చర్చలు..
తెగని పీఆర్‌సీ పంచాయితీ.. పట్టువీడని ఉద్యోగ సంఘాలు.. రేపు కూడా చర్చలు..

 PRC Meeting: తెగని పీఆర్‌సీ పంచాయితీ.. పట్టువీడని ఉద్యోగ సంఘాలు.. రేపు కూడా చర్చలు..

PRC పంచాయితీ తెగలేదు. చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగ సంఘాలతో దాదాపు 6 గంటలపాటు మంతనాలు జరిపింది ప్రభుత్వం. ఆర్థిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాలు..


PRC Meeting: తెగని పీఆర్‌సీ పంచాయితీ.. పట్టువీడని ఉద్యోగ సంఘాలు.. రేపు కూడా చర్చలు..

Prc Meeting

పీఆర్‌సీ పంచాయితీ తెగలేదు. చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగ సంఘాలతో దాదాపు 6 గంటలపాటు మంతనాలు జరిపింది ప్రభుత్వం. ఆర్థిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాలు అభిప్రాయాలు తీసుకున్నారు. మొత్తం 21 ప్రధాన అంశాలపై యూనియన్లు వాదనలు వినిపించాయి. రేపు కూడా చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. అటు CPS అమలుపై క్లారిటీ ఇచ్చారు సజ్జల. నిన్న తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా చూపించారని చెప్పారు. సీపీఎస్ అమలుపై కొన్ని ఇబ్బందులు ఉన్నా…తప్పనిసరిగా చర్చిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని నిపుణులతో చర్చించి త్వరగా పరిష్కరిస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పారు సజ్జల.


ఇక PRC ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని.. వచ్చే రెండు రోజుల్లో CMతో సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయాయి. వీలైనంత త్వరగా PRC ఇంప్లిమెంట్ చేయాలని కోరాయి. 34 శాతానికి తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సచివాలయ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది..


అటు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాత్రం 50 శాతం ఫిట్‌మెంట్‌ను డిమాండ్ చేసింది. కనీస వేతనం 26 వేలు చేయాలని కోరింది. శుక్ర లేదా సోమవారం ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పింది.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments