APPSC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్... 93,780 వరకు వేతనంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు |
APPSC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్... 93,780 వరకు వేతనంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు
APPSC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్... 93,780 వరకు వేతనంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
APPSC Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మరో జాబ్ నోటిఫికేషన్ ద్వారా గెజిటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఖాళీలు, విద్యార్హతలు, ఇతర వివరాలు తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు అలర్ట్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మరిన్ని ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా 25 గెజిటెడ్ పోస్టుల్ని ఏపీపీఎస్‌సీ భర్తీ చేస్తోంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్స్ ద్వారా నాన్ గెజిటెడ్ పోస్టుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ నోటిఫికేషన్ ద్వారా ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, సెరీకల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ డైరెక్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 28 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, ఖాళీల సంఖ్య తెలుసుకోండి.
APPSC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు | 25 | విద్యార్హతలు | వయస్సు | వేతనం |
---|---|---|---|---|
ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏఫీ ఫిషరీస్ సర్వీస్) | 11 | బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ | 18 నుంచి 42 ఏళ్లు | రూ.29,760 బేసిక్ వేతనంతో మొత్తం రూ.80,930 |
సెరీకల్చర్ ఆఫీసర్ (సెరీకల్చర్ సర్వీస్) | 1 | సెరీకల్చర్, బాటనీ, జువాలజీ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ సెకండ్ ప్లాస్ కావాలి. బ్యాచిలర్స్ డిగ్రీలో అగ్రికల్చర్ | 18 నుంచి 42 ఏళ్లు | రూ.35,120 బేసిక్ వేతనంతో మొత్తం రూ.87,130 |
అగ్రికల్చర్ ఆఫీసర్ (అగ్రికల్చర్ సర్వీస్) | 6 | బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ | 18 నుంచి 42 ఏళ్లు | రూ.35,120 బేసిక్ వేతనంతో మొత్తం రూ.87,130 |
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (ఏపీ వర్క్స్ అకౌంట్స్ సర్వీస్) | 2 | బ్యాచిలర్స్ డిగ్రీ | 18 నుంచి 42 ఏళ్లు | రూ.29,760 బేసిక్ వేతనంతో మొత్తం రూ.80,930 |
టెక్నికల్ అసిస్టెంట్ (ఏపీ పోలీస్ సర్వీస్) | 1 | బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ | 21 నుంచి 28 ఏళ్లు | రూ.40,270 బేసిక్ వేతనంతో మొత్తం రూ.93,780 |
అసిస్టెంట్ కమిషనర్ (ఏపీ ఎండోమెంట్స్ సర్వీస్) | 3 | న్యాయ శాస్త్రంలో డిగ్రీ | 28 నుంచి 42 ఏళ్లు | రూ.31,460 బేసిక్ వేతనంతో మొత్తం రూ.84,970 |
అసిస్టెంట్ డైరెక్టర్ (ఏపీ హార్టీకల్చర్ సర్వీస్) | 1 | ఎంఎస్‌సీ హార్టీకల్చర్ | 18 నుంచి 42 ఏళ్లు | రూ.40,270 బేసిక్ వేతనంతో మొత్తం రూ.93,780 |
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment