BSNL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. BSNLలో 55 ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి |
BSNL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. BSNLలో 55 ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
నిరుద్యోగులకు శుభవార్త.. BSNLలో 55 ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల అప్రంటీస్ ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను (Job Notification) విడుదల చేస్తోంది. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 55 అప్రంటీస్ ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్ (Apprenticeship) విధానంలో పని చేయాల్సి ఉంటుంది. మహారాష్ట్ర (Maharashtra) సర్కిల్ లో వీరు పని చేయాల్సి ఉంటుంది. ఈ అభ్యర్థులకు నెలకు రూ. 8 వేల చొప్పున స్కాలర్ షిప్ (Scholarship) అందించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
అర్హతల వివరాలు: ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 29 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లను వయో పరిమితిగా నిర్ణయించారు. ఇప్పటికే అప్రంటీస్ గా పని చేస్తున్న వారు మళ్లీ అప్లై చేసుకోవడానికి అనర్హులు.
Hyderabad Police Job Mela: హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా.. 20 కంపెనీల్లో 2000+ జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
ఎలా అప్లై చేయాలంటే..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు MHRDNATS పోర్టల్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు డిసెంబర్ 29ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
Jobs in Telangana: హైదరాబాద్ NIMSలో ఉద్యోగాలు.. భారీగా వేతనాలు.. ఇలా అప్లై చేయండి
Step 1: అభ్యర్థులు ముందుగా www. mhrdnats.gov.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం Enroll పై క్లిక్ చేయాలి.
Step 3: అప్లికేషన్ ఫామ్ లో సూచించిన వివరాలను నమోదు చేయాలి. దీంతో మీకు యునిక్ ఎన్రోల్మెంట్ నంబర్ జనరేట్ అవుతుంది.
Step 4: అనంతరం లాగిన్ అవ్వాలి.
Step 5: తర్వాత Establishment Request Menu క్లిక్ చేయాలి.
Step 6: తర్వాత Find Establishment క్లిక్ చేయాలి. అనంతరం Resume అప్ లోడ్ చేయాలి.
Step 7: తర్వాత Establishment name ను ఎంపిక చేసుకోవాలి.
Step 8: అనంతరం సంబంధిత BA ఎస్టాబ్లీష్మెంట్ పేరును టైప్ చేసి సెర్చ్ చేయాలి.
తర్వాత అప్లైపై క్లిక్ చేయాలి.
-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment