ఆంధ్రప్రదేశ్‌లో 365 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మూడు రోజులే అవకాశం |
Jobs in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో 365 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మూడు రోజులే అవకాశం
అనంతపురంలో ఉద్యోగాలు
Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మహిళా, శిశు అభివృద్ధి సంస్థ అనంతపురం (Anantapur) జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టులో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొత్తం 365 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తుకు డిసెంబర్ 16, 2021 వరకు అవకాశం ఉంది.
అంగన్‌వాడీ (Anganwadi) కార్యకర్త , మినీ అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకురాలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (Application Process) పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా రూ.7,000, రూ. 11,500 నెలవారీ వేతనం చెల్లిస్తారు. దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://ananthapuramu.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 16, 2021 వరకు అవకాశం ఉంది.
ముఖ్యమైన సమాచారం..
పోస్టుల సంఖ్య 365
అర్హతలు
అంగన్‌వాడీ (Anganwadi) కార్యకర్త , మినీ అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి పదోతరగతి పాసై ఉండాలి. కచ్చితంగా వివాహిత అయి ఉండాలి. అభ్యర్థి స్థానికంగా ఉండాలి.
వయోపరిమితి జూలై 1, 2021 నాటికి అభ్యర్థి వయసు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం వివరాలు
అంగన్‌వాడీ కార్యకర్తకి నెలకు రూ.11,500మినీ అంగన్‌వాడీ కార్యకర్తకి నెలకు రూ.7,000అంగన్‌వాడీ సహాయకురాలికి రూ.7,000
అధికారిక వెబ్‌సైట్ https://ananthapuramu.ap.gov.in/
Jobs in Andhra Pradesh: గుంటూరు జిల్లాలో 61 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రెండు రోజులే చాన్స్!
ఎంపిక విధానం..
Step 1 : అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
Step 2 : సీడీపీఓలు నిర్వహించే డిక్టేషన్, ఇతర వివరాలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://ananthapuramu.ap.gov.in/ ను సందర్శించాలి.
Step 3 : అనంతరం నోటిఫికేషన్ చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : నోటిఫికేషన్‌లో అర్హతలు.. అన్ని సరిగా చూసుకోవాలి.
CTET 2021: సీటెట్ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ కావడం లేదా.. అయితే ఇలా చేయండి!
Step 5 : నోటిఫికేషన్ చివరిలో దరఖాస్తు ఫాం ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Step 6 : తప్పులు లేకుండా దరఖాస్తు ఫాంను నింపాలి.
Step 7 : అనంతరం విద్యార్హతకు సంబంధించిన గజిటెడ్ అధికారిచే ధ్రువీకరించి మెమోలను జతపర్చాలి.
Step 8 : దరఖాస్తులను అందించేందుకు వివరాల కోసం సీడీపీఓ కార్యాలయాన్ని సందర్శించాలి.
Step 9 : దరఖాస్తుకు డిసెంబర్ 16, 2021 వరకు అవకాశం ఉంది.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment