Breaking

Search Here

18 December 2021

NASA: అంతరిక్ష చరిత్రలో సంచలనం.. తొలిసారి సూర్యుడిని తాకిన నాసా స్పేస్‌క్రాఫ్ట్.. పార్కర్ సోలార్ ప్రోబ్ తీసిన ఫొటోలు..

NASA: అంతరిక్ష చరిత్రలో సంచలనం.. తొలిసారి సూర్యుడిని తాకిన నాసా స్పేస్‌క్రాఫ్ట్.. పార్కర్ సోలార్ ప్రోబ్ తీసిన ఫొటోలు..
NASA: అంతరిక్ష చరిత్రలో సంచలనం.. తొలిసారి సూర్యుడిని తాకిన నాసా స్పేస్‌క్రాఫ్ట్.. పార్కర్ సోలార్ ప్రోబ్ తీసిన ఫొటోలు

 

NASA: అంతరిక్ష చరిత్రలో సంచలనం.. తొలిసారి సూర్యుడిని తాకిన నాసా స్పేస్‌క్రాఫ్ట్.. పార్కర్ సోలార్ ప్రోబ్ తీసిన ఫొటోలు..

అంతరిక్ష చరిత్రలో తొలిసారి ఓ అద్భుతం జరిగింది. నాసా ప్రయోగించిన ఉపగ్రహం సూర్యుడిని టచ్ చేసింది. సూర్యుడిపై నెలకొన్న పరిస్థితులను తెలుసుకుని షాక్ అవుతున్నారు శాస్త్రవేత్తలు.


NASA: అంతరిక్ష చరిత్రలో సంచలనం.. తొలిసారి సూర్యుడిని తాకిన నాసా స్పేస్‌క్రాఫ్ట్.. పార్కర్ సోలార్ ప్రోబ్ తీసిన ఫొటోలు..

Nasa Spacecraft

అంతరిక్ష చరిత్రలో తొలిసారి ఓ అద్భుతం జరిగింది. నాసా ప్రయోగించిన ఉపగ్రహం సూర్యుడిని టచ్ చేసింది. సూర్యుడిపై నెలకొన్న పరిస్థితులను తెలుసుకుని షాక్ అవుతున్నారు శాస్త్రవేత్తలు. రోజురోజుకు టెక్నాలజీని అభివద్ధి చేస్తున్న ఎన్నో విజయాలు అందుకున్నాడు. ఆశగా చూసే చంద్రుడిని తాకారు. 1969లో తొలిసారి చంద్రుడిపై అడుగు పెట్టాడు. ఎన్నో విశేషాలు కనిపెట్టాడు. ఆ తరువాత ఎన్నో పరిశోధనలు, మరెన్నో ప్రయోగాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఎన్నో విజయాలు సాధించాడు. తాజాగా ఖగోళ పరిశోధనల్లో ఓ అద్భుత ఘట్టాన్ని ఆవిష్కృతం చేశారు సైంటిస్టులు. మానవ నిర్మిత సాధనం, మొట్టమొదటిసారి సూర్యుడిని తాకింది. భూమితోపాటు సౌరవ్యవస్థకు ఆధారంగా ఉన్న సూర్యుడి గురించి రహస్యాలను తెలుసుకోవాలనే లక్ష్యంగా ఇంకాస్త దగ్గరైంది.


నాసా పంపిన పార్కర్ స్పేస్‌క్రాఫ్ట్ సూర్యుడి వాతావరణంలోకి ప్రవేశించింది. దీనికి సంబంధిచి నాసా చెప్పిన విషయాలు, పార్కర్ పంపిన ఫొటోలు, తర్వాత చేయబోయే పనుల గురించి ఆసక్తి నెలకొంది. సూర్యుడి చుట్టూ తిరిగే అన్ని గ్రహాల చరిత్ర గురించి క్లుప్తంగా.. నిర్విరామంగా పరిశోధనలు చేస్తున్నారు నాసా ఖగోళ శాస్త్రవేత్తలు. కానీ అగ్నిగోళంలా ఉండే సూర్యుడికి దగ్గరగా ఇప్పటివరకు ఏ స్పేస్‌క్రాఫ్ట్‌లూ వెళ్లలేకపోయాయి.


భయంకరమైన వాతావరణం వల్ల సూర్యుడిని స్టడీ చేయాలనే ప్రయత్నాలు కూడా పెద్ద ఛాలెంజ్‌గా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ సంచలనం సృష్టించింది. నాసా ప్రయోగించిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ స్పేస్​క్రాఫ్ట్ సూర్యుడిని టచ్ చేసింది. ఈ విషయాన్ని అమెరికా జియోఫిజికల్ యూనియన్ సమావేశంలో శాస్త్రవేత్తలు వెల్లడించారు. నాసా స్పేస్ క్రాఫ్ట్ పార్కర్ నిజానికి ఈ ఏడాది ఏప్రిల్​లోనే సూర్యుడి వాతావరణంలోకి చేరుకుంది. అయితే అక్కడ సేకరించిన వివరాలను ఇన్ని నెలల తర్వాత నాసాకు చేరింది.


పార్కర్ సోలార్ ప్రోబ్ పంపిన సమాచారాన్ని విశ్లేషించి.. డీ కోడింగ్ చేయడానకి నాసా శాస్త్రవేత్తలకు ఇంత సమయం పట్టింది. నాసా పంపించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ చరిత్రలోనే తొలిసారిగా సూర్యుడిని టచ్ చేసింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ సూర్యుడి ఉపరితల వాతావరణంలోకి విజయవంతంగా ఎంట్రీ ఇచ్చింది. అక్కడే ఐదు గంటల పాటు నిలిచి ఉంది. ఈ సమయంలో అక్కడి అణువులను, అయస్కాంత క్షేత్రాన్ని ట్రాక్ చేసింది స్పేస్‌క్రాఫ్ట్‌.


సూర్యుడి ఆకర్షణ, అయస్కాంత క్షేత్రాల ఆకర్షణ, అక్కడి సౌర పదార్థంపై ప్రభావం చూపిస్తున్నాయని తేల్చారు నాసా  పరిశోధకులు. సూర్యుడి లోపలి నుంచి పైకి పొంగుకొస్తున్న అత్యంత తీవ్రమైన వేడి, ఒత్తిడీ, సౌర పదార్థాన్ని పైకి నెడుతూ ఉంటే, ఆ సౌర పదార్థం పైకి ఎగజిమ్ముతోందని సోలార్ ప్రూబ్ ద్వారా తెలిసిందని చెప్పారు శాస్త్రవేత్తలు తేల్చారు.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments