Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ.. |
Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా అభిమానులకు.. సెలబ్రెటీలకు మధ్య వారధిగా
Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా అభిమానులకు.. సెలబ్రెటీలకు మధ్య వారధిగా మారింది ఇంటర్నెట్. తమ అభిమాన హీరోహీరోయిన్స్ గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాను తెగ ఉపయోగించుకుంటారు. ఇక సెలబ్రెటీలు సైతం తమ లేటేస్ట్ ఫోటోలతోపాటు.. సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటారు.
అయితే కొన్నిసార్లు సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీలకు తలనొప్పి మాత్రం తగ్గడం లేదు. తమకు నచ్చని సెలబ్రెటీలను దారుణంగా ట్రోల్ చేయడం.. వారు షేర్ చేసే ఫోటోలకు.. వీడియోలకు నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇలా ట్రోల్ చేయడం ఎక్కువగా జరుగుతుంటుంది. ఇటీవల పాయల్ రాజ్ పుత్‌కు సంబంధించిన వీడియోపై.. ఆమె షేర్ చేసిన ఫోటోలపై దారుణంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నేషనల్ క్రష్ రష్మికను ట్రోల్ చేశాడు ఓ నెటిజన్.
Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ.. |
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుప్ప. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో చిత్రయూనిట్ బిజీగా గడిపేస్తుంది. తాజాగా ఓఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ సామీ సామీ పాట కోసం ఎంతో కష్టపడ్డాను.. అది చూశాక అందరూ నన్ను ప్రశంసిస్తే చాలు. డైరెక్టర్స్ ఏం చెబితే అదే నేను చెస్తా అంటూ మాట్లాడిన వీడియోను రష్మిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. అసలు దీన్ని హీరోయిన్ గా తీసుకోకుండా ఉండాల్సింది. ఇది.. దీని ఓవర్ యాక్టింగ్ అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసిన రష్మిక… యాక్టింగో.. ఓవరాక్టింగో.. నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాను నువ్వు ఏం సాధించావు నాన్నా.. అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment