PM Narendra Modi |
PM Narendra Modi: సమాజాన్ని మేల్కొల్పిన సద్గురు సదాఫల్‌దేవ్.. స్వర్వేద్ మందిర్ 98వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ..
PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం వారణాసిలోని స్వర్వేద్ మహామందిర్
PM Narendra Modi: సమాజాన్ని మేల్కొల్పిన సద్గురు సదాఫల్‌దేవ్.. స్వర్వేద్ మందిర్ 98వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ..
PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం వారణాసిలోని స్వర్వేద్ మహామందిర్ ధామ్‌ను సందర్శించారు. ఉమ్రాలోని స్వర్వేద్ మహామందిర్ ధామ్‌లో ఏర్పాటు చేసిన విహంగం యోగా 98వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదాఫల్‌దేవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ స్వర్వేద్ ఆలయ విశిష్టతను తెలుసుకొని.. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా తిలకించారు. ఆయనవెంట యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.
అనంతరం ప్రధానమంత్రి మోదీ స్వర్వేద్ మందిర్ 98వ వార్షికోత్సవం (విహంగం యోగా 98వ వార్షికోత్సవం) లో ప్రసంగించారు. విహంగం యోగా సంస్థాన్ కార్యక్రమానికి హాజరుకావడం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తంచేశారు. ఈరోజు యోగా సంస్థాన్ 98వ వార్షికోత్సవం, సద్గురు సఫల్‌దేవ్ మహారాజ్ జైలు పర్యటన పూర్తయి 100 సంవత్సరాలు, గీతా జయంతి అన్ని ఒకేరోజు వచ్చాయంటూ శుభాకాంక్షాలు తెలిపారు. సద్గురు సదాఫల్‌దేవ్ జీ సమాజాన్ని మేల్కొల్పడానికి విహంగం యోగాని విస్తృతం చేయడానికి ఒక యాగం చేశారంటూ కొనియాడారు.
అతిపెద్ద స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడిని మహాత్మ అని పిలుస్తారని.. ఇక్కడ స్వాతంత్ర్య పోరాటంతో పాటు ఆధ్యాత్మిక స్పృహ కొనసాగిందన్నారు. స్వాతంత్య్రంలో సంత్ సదాఫల్దేవ్ జీ కూడా ముఖ్యమైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. జైల్లోనే స్వర్వేదం గురించి ఆలోచించి బయటకు వచ్చి దానికి స్వరూపాన్ని ఇచ్చారన్నారు. మన స్వాతంత్య్ర పోరాట చరిత్రను యథాతథంగా నమోదు చేయలేదంటూ ప్రధాని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ వారణాసి రెండోరోజు పర్యటనలో బీజేపీ పాలిత 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశమయ్యారు. ఇందులో ప్రభుత్వ విధానాలు, పథకాల ప్రచారం, రానున్న అసెంబ్లీ ఎన్నికలు, ప్రజలతో అనుసంధానం వంటి అన్ని అంశాలపై చర్పించారు. అనంతరం స్వర్వేద్ మహామందిర్ ధామ్‌కు చేరుకుని, విహంగం యోగా 98వ వార్షికోత్సవంలో పాల్గొని ఢిల్లీ పయనమయ్యారు.
good
ReplyDelete