Breaking

Search Here

17 December 2021

Omicron variant: తెలంగాణలో ఒమిక్రాన్ వణుకు.. హైదరాబాద్‌లో 2 యాక్టివ్ కేసులు

Omicron variant: తెలంగాణలో ఒమిక్రాన్ వణుకు.. హైదరాబాద్‌లో 2 యాక్టివ్ కేసులు
Omicron variant: తెలంగాణలో ఒమిక్రాన్ వణుకు.. హైదరాబాద్‌లో 2 యాక్టివ్ కేసులు

 Omicron variant: తెలంగాణలో ఒమిక్రాన్ వణుకు.. హైదరాబాద్‌లో 2 యాక్టివ్ కేసులు

తెలంగాణలో ఒమిక్రాన్ వణుకు మొదలైంది.  హైదరాబాద్‌లో 3 ఒమిక్రాన్‌ కేసులు గుర్తించారు వైద్యారోగ్య శాఖ అధికారులు.


Omicron variant: తెలంగాణలో ఒమిక్రాన్ వణుకు.. హైదరాబాద్‌లో 2 యాక్టివ్ కేసులు


తెలంగాణలో ఒమిక్రాన్ వణుకు మొదలైంది.  హైదరాబాద్‌లో 3 ఒమిక్రాన్‌ కేసులు గుర్తించారు వైద్యారోగ్య శాఖ అధికారులు. వీరిలో ఒకరు కెన్యా  నుంచి, మరొకరు సోమాలియా నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిద్దరూ కూడా నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి రావడం గమనార్హం. మరో కేసుకు సంబంధించి…  7 ఏళ్ల బాలుడికి కరోనా నిర్ధారణ అయినప్పటికీ.. అతను బెంగాల్ వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ బాలుడు విదేశాల నుంచి వచ్చి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగి.. అక్కడి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్‌లో కోల్‌కల్ వెళ్లినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్‌లో పాజిటివ్ వచ్చినవారు.. టోలిచౌకి, మెహదీపట్నం వాసులుగా గుర్తించారు. కెన్యా నుంచి వచ్చిన 24 ఏళ్ల బాధితురాలికి గచ్చిబౌలి టిమ్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. సోమాలియా నుంచి వచ్చిన అబ్బాయికి కూడా ఒమిక్రాన్ గుర్తించారు గానీ.. అతను ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలియడంలేదు. అతని కోసం గాలిస్తున్నారు వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది. వీరిద్దరూ ఆయా దేశస్థలే తప్ప.. మనవాళ్లు కాదు. రాష్ట్రంలో ఎవరికీ కరోనా సోకలేదు.  తెలంగాణలో ప్రస్తుతానికి రెండు యాక్టివ్ ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఇదే విషయాన్ని ధృవీకరించారు వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్. దీంతో అన్ని జిల్లాల వైద్యాధికారులను ప్రభుత్వం అలెర్ట్ చేసింది. పాజిటివ్ అని తేలినవారి కాంటాక్ట్స్‌ను ఐసోలేషన్‌కు తరలించారు.


ఇండియాలోని ఆరు రాష్ట్రాల్లో 57 ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. తాజాగా తెలంగాణలో నమోదైన 3 కేసులతో కలిపి.. దేశంలో ఇప్పుడు 60 కేసులు రిజిస్ట్రర్ అయ్యాయి. ఇటు ఏపీలోనూ మూడు రోజుల క్రితం ఒక ఒమిక్రాన్ కేసు రిజిస్ట్రర్ అయ్యింది. పదిరోజుల క్రితం విజయనగరం జిల్లాలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ గుర్తించారు. ట్రీట్‌మెంట్ తర్వాత అతనికి నెగిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు. సో.. ఏపీలో ప్రస్తుతానికి యాక్టివ్ కేసు లేకపోయినా లెక్కల్లో మాత్రం ఓ ఒమిక్రాన్ కేసు ఉన్నట్టే లెక్క.

1 comment:

Hello all, if you have any doubt feel free comment

Comments