Breaking

Search Here

16 December 2021

Modi Meet MPs: దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో మోడీ కీలక భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం!

 

Modi Meet MPs: దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో మోడీ కీలక భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం!
Modi Meet MPs: దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో మోడీ కీలక భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం!

Modi Meet MPs: దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో మోడీ కీలక భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం!

అఖండ భారతం కాషాయం చేయాలని సంకల్పిస్తన్న భారతీయ జనతా పార్టీ.. ఈ దిశగా అడుగులు వేస్తోంది. 2023 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటినుంచే బీజేపీ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టింది.


Modi Meet MPs: దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో మోడీ కీలక భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం!


PM Modi Meet Southern states BJP MPs: అఖండ భారతం కాషాయం చేయాలని సంకల్పిస్తన్న భారతీయ జనతా పార్టీ.. ఈ దిశగా అడుగులు వేస్తోంది. 2023 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటినుంచే బీజేపీ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల బీజేపీ పార్లమెంటు సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. అయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ప్రధాని మోడీ. దాదాపు గంటపాటు కొనసాగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.


ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఎంపీల భేటీ సందర్బంగా.. ఎంపీ ప్రధాని మోడీ అల్పాహార విందు ఇచ్చారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, ప్రతుత్వ పథకాల అమలు తీరుపై ఎంపీలతో మోడీ చర్చించారు. అయా రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల పనితీరుపై ప్రధాని మోడీ ఆరా తీశారు. అయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు మోడీ.


ఇదిలావుంటే, పార్లమెంట్ సమావేశాల సమయంలో వివిధ రాష్ట్రాల ఎంపీలకు అల్పాహార విందు ఇస్తూ వస్తున్న ప్రధాని.. బుధవారం దక్షిణాది రాష్ట్రాలకు చెందన పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. మోడీతో సమావేశానికి తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు హాజరయ్యారు. ఇక, ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ ఎంపీలు జీవిఎల్ నరసింహారావు, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ సమావేశంలో పాల్గొన్నారు.


దేశవ్యాప్తంగా భారతీయ జనతాపార్టీ బలోపేతం చేసేందుకు ఆధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా పాదువులు కదుపుతోంది బీజేపీ. ఇప్పటికే ఉత్తరాదిన తిరుగులేని శక్తిగా ఎదిగిన పార్టీ.. దక్షిణాదిన కూడా సత్తా చాటాలని భావిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు ఎప్పటినుంచో అనుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీలల్లో వలసలు చేరికల ద్వారా పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అనుకన్నంతగా ఎంపీ సీట్లను గెలవాలని పార్టీ అధినాయత్వం ఎప్పటి నుంచో భావిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ సహా మరిన్ని అంశాలపై బీజేపీ సీఎంలతో ప్రధాని మోడీ చర్చించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రాంతీయ పార్టీల కూటమిగా ఏర్పడి బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమవుతున్న నేప‌థ్యంలో మోడీతో ఎంపీల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments