Breaking

Search Here

16 December 2021

Vijayawada: షార్ట్ ఫిల్మ్ పేరుతో స్మార్ట్ దోపిడీ.. వీళ్లు మామూలోళ్లు కాదు

Vijayawada: షార్ట్ ఫిల్మ్ పేరుతో స్మార్ట్ దోపిడీ.. వీళ్లు మామూలోళ్లు కాదు..
Vijayawada: షార్ట్ ఫిల్మ్ పేరుతో స్మార్ట్ దోపిడీ.. వీళ్లు మామూలోళ్లు కాదు

Vijayawada: షార్ట్ ఫిల్మ్ పేరుతో స్మార్ట్ దోపిడీ.. వీళ్లు మామూలోళ్లు కాదు..

విజయవాడ (Vijayawada) కు చెందిన ఇద్దరు వ్యక్తులు తాము షార్ట్ ఫిల్మ్ తీస్తున్నామని.. అందుకోసం తమకు అధునాతన కెమెరాలు కావాలని హైదరాబాద్ (Hyderabad) కమలాపూర్ కాలనీకి చెందిన కెమెరా రెంటల్ సంస్థను సంప్రదించారు. తీరా కెమెరాలు వచ్చిన తర్వాత అసలు సినిమా చూపించారు.


ఇళ్ల తాళాలు పగలగొట్టి దోపిడీ చేసే దొంగల్ని చూశాం. పర్సులు కొట్టేసే జేబుదొంగల్ని కూడా చూశాం. టెక్నాలజీతో ఎకౌంట్లను ఖాళీ చేసే సైబర్ దొంగలు కూడా ఇప్పుడు కొత్తేం కాదు. కానీ వీళ్లు మాత్రం చాలా డిఫరెంట్ దొంగలు, బాధితులే తమ దగ్గరున్న సొమ్మును దొంగల చేతుల్లో పెట్టేలా స్మార్ట్ స్కెచ్ వేశారు. లక్షల రూపాయలు విలువ చేసే సొత్తుతో ఎస్కేపయ్యారు. సినిమా స్టైల్లో ఎక్కడా.. ఎవరికీ చిన్న అనుమానం రాకుండా చోరీ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేని పక్కాగా అమలు చేశారు. ఈ స్టోరీ చదివితే నిజంగానే వీళ్లు మామూలోళ్లు కాదనే సంగతి తెలిసిపోతుంది. దేనికేనా రెడీ అనే ఈ ముఠా చేసిన ఘనకార్యం చూస్తే నొరెళ్లబెట్టకమానరు.


వివరాల్లోకి వెళ్తే.., విజయవాడ (Vijayawada) కు చెందిన ఇద్దరు వ్యక్తులు తాము షార్ట్ ఫిల్మ్ తీస్తున్నామని.. అందుకోసం తమకు అధునాతన కెమెరాలు కావాలని హైదరాబాద్ (Hyderabad) కమలాపూర్ కాలనీకి చెందిన కెమెరా రెంటల్ సంస్థను సంప్రదించారు. వారికి కావాల్సిన కెమెరాల వివరాలు తెలుసుకున్న సదరు సంస్థ.. అద్దె మొత్తం, కెమెరామెన్ కి సంబంధించిన వేతనం మాట్లాడి హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో కెమెరాలు పంపించారు. కేతావత్ అనే యువకుడు కెమెరాలను తీసుకొని విజయవాడ బస్టాండ్ లో దిగాడు. వెంటనే తమకు ఆర్డర్ ఇచ్చిన వ్యక్తుకలు ఫోన్ చేశాడు.

ఇది చదవండి: అతడికి 21, ఆమెకు 35.. ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్లారు.. కొద్దిసేపటికి ఊహించని ఘటన..


కొద్దిసేపటి తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆటోలో అక్కడికి వచ్చారు. కేతావత్ ను ఓ హోటల్లో ఉంచి ఫ్రెష్ అవ్వాలని సూచించారు. ఆ తర్వాత టిఫిన్ చేసి రమ్మని.. తాము రూమ్ లో ఉంటామని అతడ్ని బయటకు పంపారు. టిఫిన్ పూర్తి చేసుకొని రూమ్ కు వచ్చిన కేతావత్ కు ఆ ఇధ్దరితో పాటు కెమెరాలు కూడా కనిపించలేదు. వెంటనే కంగారు పడిపోయి వారికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది.

ఇది చదవండి: స్టూడెంట్ తో లెక్చరర్ ప్రేమాయణం.. ఫిజిక్స్ క్లాస్ లో కెమిస్ట్రీ పాఠాలు.. కట్ చేస్తే..


దీంతో తాను మోసపోయానని గ్రహించి గవర్నర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హోటల్లోని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దొంగిలించిన కెమెరాల విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. గతంలో నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అద్దె పేరుతో కెమెరాను తీసుకెళ్లిన ఓ వ్యక్తి పరారవడం కలకలం రేపింది. మొత్తానికి కెమెరాలు కొనుక్కోలేని వారికి అద్దెకిస్తూ నాలుగు రాళ్లు సంపాదించాలని భావించే కెమెరా రెంటల్స్ నిర్వాహకులకు ఇలాంటి కేటుగాళ్లు బురిడీ కొట్టి లక్షల్లో నష్టం వాటిల్లేలా చేస్తున్నారు.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments