Breaking

Search Here

15 December 2021

Brahmastra రణ్‌బీర్ కపూర్, నాగార్జున, అమితాబ్‌ల ప్యాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ రిలీజ్ డేట్ ప్రకటన

Brahmastra : రణ్‌బీర్ కపూర్, నాగార్జున, అమితాబ్‌ల ప్యాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ రిలీజ్ డేట్ ప్రకటన..

రణ్‌బీర్ కపూర్, నాగార్జున, అమితాబ్‌ల ప్యాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ రిలీజ్ డేట్ ప్రకటన

Brahmastra : రణ్‌బీర్ కపూర్, నాగార్జున, అమితాబ్‌ల ప్యాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ రిలీజ్ డేట్ ప్రకటన..

‘బ్రహ్మాస్త్ర’ మూవీ రిలీజ్ డేట్ ()

Brahmastra | రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమాలో  నాగార్జున, అమితాబ్‌ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు.


Brahmastra : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్యాన్ ఇండియా మూవీస్‌ అంటే అందరికీ తెలిసొచ్చింది. రాజమౌళి, ప్రభాస్ రగిలించిన ప్యాన్ ఇండియా ఫీవర్‌ను కంటిన్యూ చేసిన మూవీ ‘కేజీఎఫ్’.  ప్రశాంత్ నీల్ దర్శత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ‘కేజీఎఫ్’ కూడా ప్యాన్ ఇండియా లెవల్లో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే కదా. ఈ సినిమాలు ఇచ్చిన ఇన్‌స్ప్రిరేషన్‌తో  వివిధ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీస్ తెరకెక్కుతున్నాయి. ఈ కోవలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమాలో  నాగార్జున, అమితాబ్‌ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ -1ను 9 సెప్టెంబర్  2022న విడుదల చేస్తున్నట్టు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.


‘బ్రహ్మాస్త్ర’లో రణ్‌బీర్ కపూర్.. ‘శివ’ పాత్రలో నటిస్తున్నారు. మొదటి భాగానికి ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 1 శివ’ అని రిలీజ్ చేస్తున్నారు. చేతిలో త్రిశూలంతో వెనకాల మహాదేవుడు పరమశివుడున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ ‘సారే అస్త్రే కే దేవతా’ అని పోస్టర్‌లో ఉంది. బ్రహ్మాస్త్రం అనేది తిరుగులేని అస్త్రం అనే అర్ధం. మన పురాణా ఇతిహాసలైన రామాయణ, మహా భారతంలో బ్రహ్మాస్త్రం గురించి వివరాలున్నాయి. ఇపుడు ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కించారు.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments