Breaking

Search Here

25 December 2021

Mig Plane Crash: కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. పైలెట్ మృతి

కొద్ది రోజుల క్రితం తమిళనాడులో ఇదే విధమైన IAF హెలికాప్టర్ కూలిపోయి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మరియు మరో 13 మంది మరణించారు. ఈ ఘటన జరిగి కొద్దివారాలు గడవకముందే మరో వైమానిక దళం విమానం కూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత రెండేళ్లలో భారత వైమానిక దళానికి చెందిన ఏడు విమానాలు కూలిపోయాయని ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం రాజ్యసభకు తెలియజేసింది
Mig 21 Plane Crash: 1971 నుండి ఏప్రిల్ 2012 వరకు 482 మిగ్ విమానాలు ప్రమాదాలకు గురయ్యాయి.

Mig Plane Crash: కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. పైలెట్ మృతి

Mig 21 Plane Crash: 1971 నుండి ఏప్రిల్ 2012 వరకు 482 మిగ్ విమానాలు ప్రమాదాలకు గురయ్యాయి.

భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం ఈరోజు సాయంత్రం రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో కూలిపోయింది. ఈ విమానం నడిపిన పైలట్ ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన ప్రదేశం కూడా ఇంకా వెల్లడి కాలేదు. సామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెజర్ట్ నేషనల్ పార్క్ ప్రాంతంలో విమానం కూలిపోయిందని జైసల్మేర్ ఎస్పీ అజయ్ సింగ్ ఏజెన్సీకి తెలిపారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని, తాను కూడా ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ప్రమాదంపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్పందించింది. ఈ సాయంత్రం 8:30 గంటల సమయంలో MiG-21 విమానం శిక్షణ సమయంలో పశ్చిమ సెక్టార్‌లో ఎగిరే ప్రమాదానికి గురైందని పేర్కొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని.. విచారణకు ఆదేశించామని వెల్లడించింది.

ఇక MiG-21విమానాలు కూలిపోయిన ఘటనలు అనేక ఉన్నాయి. ఈ విమానాలు ఎక్కువగా కూలిపోవడంతో.. వీటికి ఎగిరే శవపేటిక అని కొందరు పేరు పెట్టారు. 1971 నుండి ఏప్రిల్ 2012 వరకు 482 మిగ్ విమానాలు ప్రమాదాలకు గురయ్యాయి. 171 మంది పైలట్లు, 39 మంది పౌరులు, ఎనిమిది మంది సైనిక సిబ్బంది, ఒక ఎయిర్‌క్రూ ఈ ప్రమాదాల కారణంగా మరణించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం మే 2012లో పార్లమెంటుకు తెలిపింది.

కొద్ది రోజుల క్రితం తమిళనాడులో ఇదే విధమైన IAF హెలికాప్టర్ కూలిపోయి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మరియు మరో 13 మంది మరణించారు. ఈ ఘటన జరిగి కొద్దివారాలు గడవకముందే మరో వైమానిక దళం విమానం కూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత రెండేళ్లలో భారత వైమానిక దళానికి చెందిన ఏడు విమానాలు కూలిపోయాయని ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం రాజ్యసభకు తెలియజేసింది

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments