అనుకున్నట్లే. చక్కగా పని చేస్తున్న చంద్రయాన్. కక్ష్య మారి దూసుకెళుతుంది
చంద్రునిపై అన్వేషణలో భాగంగా భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) చంద్రయాన్–3ని రెండోసారి విజయవంతంగా కక్ష్యను పెంచింది. ఇప్పుడు లక్ష్యానికి 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు ఇస్రో తెలిపింది. ఆర్టిట్ భూమి గురుత్వాకర్షణ నుంచి దాటి చంద్రునివైపు ప్రయాణిస్తోంది. లక్ష్యం చేరుకునేందుకు భారత అంతరిక్ష సంస్థ మరో మూడు ఎర్త్ బౌండ్ విన్యాసాలను నిర్వహించనుంది.
కాగా.. శుక్రవారం చంద్రయాన్-–3 మిషన్ ను సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి భారతదేశపు అత్యంత బరువైన లాంచ్ వెహికల్, లాంచ్ వెహికల్ మార్క్-3లో ప్రయోగించబడింది. భూమి చుట్టు ఓ ఖచ్చితమైన కక్ష్యలో మిషన్‌ను చేర్చింది. ఈ క్రమంలో మూడు దశలు సాధారణ స్థితిలో విజయవంతమయ్యాయి. ఇది ఇస్రో చరిత్రలో మైలురాయి. శ్రీహరికోటలోని స్పేస్‌పోర్ట్ నుంచి బయల్దేరిన సుమారు తొమ్మిది నిమిషాల తర్వాత చంద్రయాన్-–3 మిషన్ LVM-3 మూడవ దశలో అంతరిక్ష శూన్యంలోకి ప్రవేశించింది. ‘‘భారతీయ అంతరిక్ష వైజ్ఞానిక రంగంలో చంద్రయాన్–3 చరిత్రను తిరగరాసింది. ప్రతి భారతీయుడి కలలు, ఆశయాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లిందని” చంద్రయాన్ –3 ప్రయోగం తర్వాత విజయవంతం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
కాగా.. ఈ వ్యోమ నౌక ఆగస్టు 3న చంద్రుని కక్ష్యలోకి చేరుకోనుంది. ఆగస్టు 23న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఈ ల్యాండింగ్ విజయవంతం అయితే.. అమెరికా, చైనా, సోవియేట్ యూనియన్ దేశాల సరసన ఈ ఘనత సాధించిన నాలుగో దేశంలో భారత్చేరనుంది. చంద్రయాన్-–3 ఆరు చక్రాల ల్యాండర్,రోవర్ మాడ్యూల్ పేలోడ్లతో అమర్చబడి ఉంటుంది. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత ఇది చంద్రునిపై నేల, శిలల లక్షణాలు, వాటి రసాయన, మౌళిక కూర్పులతో సహా విలువైన డేటాను స్పేస్ సెంటర్ చేరవేయనుంది.
2019లో చంద్రుని దక్షిణ ధృవంపై రోబోటిక్ వ్యోమ నౌకను ల్యాండ్ చేసేందుకు భారత్ చేసిన మొదటి ప్రయత్నం విఫలమైంది. ఇది విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించినప్పటికీ రోవర్ మోహరించే ప్రయత్నంలో క్రాష్ అయి ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. సాఫ్ట్‌వేర్ లోపమే ఇందుకు కారణమని ఇస్రోకు సమర్పించిన ఫెయిల్యూర్ అనాలిసిస్ రిపోర్టులో వెల్లడైంది.
వీడియో చూడండి : చరిత్ర సృష్టించిన భారత్..చంద్రుడి మీదకు దూసుకెళ్లిన చంద్రయాన్ 3
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment