AP News: ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు.. కారణమేంటంటే..!
AP News: ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు.. కారణమేంటంటే..!
గుంటూరుకు చెందిన ఓ విద్యార్థి ఏపీ ఈఏపీసెట్, తెలంగాణ ఈఏపీసెట్ రెండూ రాశాడు. రెండుచోట్లా మంచి ర్యాంకులు సాధించాడు. రాష్ట్రంలో మంచి కాలేజీలో సీటు వస్తే చేరాలని భావించాడు. కానీ రాష్ట్రంలో కౌన్సెలింగ్‌కు షెడ్యూలు విడుదలలో జాప్యంతో తెలంగాణలో నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరై హైదరాబాద్‌లోని కాలేజీలో సీటు సాధించాడు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): గుంటూరుకు చెందిన ఓ విద్యార్థి ఏపీ ఈఏపీసెట్, తెలంగాణ ఈఏపీసెట్ రెండూ రాశాడు. రెండుచోట్లా మంచి ర్యాంకులు సాధించాడు. రాష్ట్రంలో మంచి కాలేజీలో సీటు వస్తే చేరాలని భావించాడు. కానీ రాష్ట్రంలో కౌన్సెలింగ్‌కు షెడ్యూలు విడుదలలో జాప్యంతో తెలంగాణలో నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరై హైదరాబాద్‌లోని కాలేజీలో సీటు సాధించాడు. ఈ ఏడాది తెలంగాణ ఈఏపీసెట్‌ను దాదాపు 50వేల మంది ఏపీ విద్యార్థులు రాశారు. వారిలో మంచి ర్యాంకులు సాధించిన చాలామంది హైదరాబాద్ బాట పడుతున్నట్లు తెలిసింది. జేఈఈ కౌన్సెలింగ్ ప్రక్రియ చాలావరకు పూర్తయింది. తెలంగాణలో మొదటి విడత ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహించి, సీట్లు కూడా కేటాయించారు. కానీ ఏపీలో మాత్రం కౌన్సెలింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఓవైపు విద్యార్థులు పక్క రాష్ర్టాలకు వెళ్లిపోతున్నా వైసీపీ సర్కారుకు పట్టడం లేదు. ఏటా పొరుగు రాష్ర్టాలతో పాటే ఇక్కడా కౌన్సెలింగ్ నిర్వహించాలని అటు కాలేజీ యాజమాన్యాలు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తుకుంటున్నా ప్రభుత్వంలో ఎలాంటి మార్పు రావడం లేదు. జాతీయ విద్యాసంస్థల కౌన్సెలింగ్ అయ్యేవరకూ వేచి చూస్తామని, లేనిపక్షంలో సీట్ల కేటాయింపులో గందరగోళం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో చాలామంది తెలంగాణ కాలేజీల్లో చేరిపోతున్నారు. అక్కడ సీటు వదులుకుంటే, రాష్ట్రంలో కోరుకున్న సీటు వస్తుందన్న గ్యారెంటీ లేదు. రిస్క్ చేయడానికి ఇష్టపడని విద్యార్థులు పొరుగు రాష్ట్రంలో సీటు వస్తే ఏపీ కాలేజీల గురించి మర్చిపోతున్నారు. ఈపాటికి రాష్ట్రంలోనూ కౌన్సెలింగ్ నిర్వహించి ఉంటే హైదరాబాద్ వెళ్లే విద్యార్థుల్లో కొందరైనా ఇక్కడే చేరే అవకాశం ఉండేది.
రాష్ట్రంలోనూ వేరే దారులు
కౌన్సెలింగ్‌లో జాప్యంతో కొందరు విద్యార్థులు డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీల్లో సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోయినా మంచి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకంతో గీతం, కేఎల్, విజ్ఞాన్, అమృత లాంటి డీమ్డ్ యూనివర్సిటీల్లో, మోహన్‌బాబు, వీఐటీ, ఎస్‌ఆర్‌ఎం లాంటి ప్రైవేటు యూనివర్సిటీల్లో చేరుతున్నారు. వీటిలో 35శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద వచ్చే అవకాశం ఉన్నా... ఆ కోటాలో వస్తుందో, లేదోనన్న సందేహంతో కొందరు మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు తీసుకుంటున్నారు. మరికొందరు విద్యార్థులు ఇతర రాష్ర్టాల్లోని ప్రైవేటు వర్సిటీల్లోనూ చేరుతున్నారు.
1,49,154 సీట్లకు ఏఐసీటీఈ అనుమతి
రాష్ట్రంలో ఈ ఏడాది 1,49,154 ఇంజనీరింగ్ సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. జూలై 1న ఈ జాబితా విడుదల చేసింది. వాటిని ఉన్నత విద్యాశాఖ పరిశీలించి... తుది సీట్ల జాబితాను మంజూరు చేయాలి. ఆ జీవో రాకుండా కౌన్సెలింగ్ ప్రారంభించడం సాధ్యంకాదు. దీంతో అసలు ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయో కూడా ఇప్పటికీ తెలియడం లేదు. అలాగే ఈ విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల కాలానికి ఫీజులు నిర్ణయించాల్సి ఉంది. కొత్త ఫీజులపై ఉన్నత విద్యా కమిషన్ చాలా రోజుల కిందటే ప్రభుత్వానికి సిఫారసులు పంపించింది. కానీ ఉన్నత విద్యాశాఖ వాటిని పట్టించుకోలేదు. ఈలోగా గతంలో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో ఫీజులపై వేసిన కేసు విచారణకు రావడంతో ఫీజుల విడుదల ఆగిపోయింది.
ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌కు షెడ్యూలు
ఈ నెల 24 నుంచి ఆగస్టు 3 వరకు రిజిస్ర్టేషన్లు
12న సీట్ల కేటాయింపు. 16 నుంచి తరగతులు
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌కు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి మంగళవారం షెడ్యూలు విడుదల చేశారు. ఈ నెల 24 నుంచి ఆగస్టు 3 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 25 నుంచి ఆగస్టు 4 వరకు హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. 3 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. 9న ఎంపిక చేసుకున్న ఆప్షన్లను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 12న సీట్లు కేటాయిస్తారు. 13, 14 తేదీల్లో విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలి. ఆగస్టు 16 నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభమవుతాయని, పూర్తి వివరాలు, సహాయ కేంద్రాల సమాచారం
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment