Breaking

Search Here

17 July 2023

సీమా హైదర్ పాకిస్తాన్ గూఢచారి. 72 గంటల్లోగా దేశం విడిచి పోవాలి. లేదంటే.

సీమా హైదర్ పాకిస్తాన్ గూఢచారి.. 72 గంటల్లోగా దేశం విడిచి పోవాలి.. లేదంటే..


ఇటీవల ఓ భారతీయ వ్యక్తిని కలుసుకునేందుకు అక్రమంగా దేశంలో ప్రవేశించిన పాకిస్థానీ మహిళపై పలువురు మితవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోకి దొంగచాటుగా చొరబడిన ఆ మహిళను బహిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని తాజాగా మితవాద సంస్థ హెచ్చరించింది.


సీమా హైదర్ దేశం విడిచి వెళ్లాలని గౌ రక్షా హిందూ దళ్ 72 గంటల అల్టిమేటం జారీ చేసింది. సీమా హైదర్ పాకిస్థాన్ గూఢచారి కావచ్చని, దాని వల్ల దేశానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు వేద్ నగర్ ఈ సందర్భంగా ఓ వీడియో విడుదల చేశారు. “విద్రోహ దేశానికి చెందిన మహిళను మేము సహించం. 72 గంటల్లో సీమా హైదర్ దేశం విడిచి వెళ్లకపోతే ఆందోళన ప్రారంభిస్తాం’’ అని నగర్ వీడియోలో పేర్కొన్నారు.


ప్రేమ కోసం సరిహద్దులు దాటింది.

సీమా గులాం హైదర్ (30), సచిన్ మీనా (25) 2019లో గేమింగ్ అప్లికేషన్ అయిన PUBG ద్వారా పరిచయమయ్యారు. పరిచయం కాస్తా వారి మధ్య ప్రేమగా మారడంతో ఆమె అక్రమంగా నేపాల్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నలుగురు పిల్లలతో సహా గ్రేటర్ నోయిడాలోని రబూపురా ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవించడం ప్రారంభించారు.


నేపాల్ ద్వారా వీసా లేకుండా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినందుకు గానూ జూలై 4న ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు సహాయం చేసినందుకు సచిన్‌ను కూడా అరెస్టు చేశారు. అయితే ఆ తర్వాత ఇద్దరికి బెయిల్ మంజూరైంది.


ఇక సీమా గూఢచారి అనే వాదనను ఆమె తోసిపుచ్చారు. "అలాంటిదేం లేదు. నిజం ఎట్టకేలకు బయటకు వస్తుంది. ఇది నిజం కాకపోతే నేను నా పిల్లలతో కాకుండా ఒంటరిగా భారతదేశానికి వచ్చేదాన్ని”అని ఆమె చెప్పింది.


 ఆమె భర్త ఏమంటున్నాడంటే.

ఇదిలా ఉండగా సీమా భర్త గులాం హైదర్.. తన భార్య, పిల్లలను ఇంటికి పంపాలని భారత ప్రభుత్వానికి హృదయపూర్వక విజ్ఞప్తి చేశాడు. తన భార్యను పబ్ జీ పేరుతో పరిచయం పెంచుకుని భారత్‌కు వచ్చేలా, ప్రలోభపెట్టి ఆ వ్యక్తి మోసగించారని ఓ వీడియోలో ఆరోపించారు. మరోవైపు, సీమా పాకిస్థాన్ కు తిరిగి రావడం తమకు ఇష్టం లేదని ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.


"ఆమెను, తన పిల్లలను పాకిస్థాన్‌కు తిరిగి పంపాలి. ఆమె అక్కడే ఉంటుంది. ఆమె ముస్లిం కూడా కాదు" అని సీమ తన పిల్లలతో గత మూడు రోజులుగా అద్దెకు తీసుకున్న ఇంటి యజమాని 16 ఏళ్ల కుమారుడు చెప్పాడు.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments