ఉద్యోగులకు సంతృప్తి
ప్రజలకు సేవలందించడం లోనే ఉద్యోగులకు సంతృప్తి కలుగుతుందని కలెక్టర్ జి. రవి నాయక్ అన్నారు.
అదనపు కలెక్టర్ కె. సీతారామారావు సన్మాన కార్యక్రమంలో కలెక్టర్ జి. రవినాయక్
మహబూబ్‌నగర్ (కలెక్టరేట్) జూలై 19 : ప్రజలకు సేవలందించడం లోనే ఉద్యోగులకు సంతృప్తి కలుగుతుందని కలెక్టర్ జి. రవి నాయక్ అన్నారు. 3 సంవత్సరాల నాలుగునెలల పాటు మహబూబ్‌నగర్ జిల్లా లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించి బదిలీపై ఆసిఫా బాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా వెళ్తున్న కొలనుపాక సీతారామారావు వీడ్కోలు సమావేశాన్ని బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవలు అందిం చేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఎవరైతే సేవలం దించిడంలో అవగాహన పొంది సకా లంలో ప్రజలకు మేలు చేస్తారో అక్కడే వారికి సంతృప్తి దొరుకుతుందని అన్నారు. ఉద్యోగులకు పనిచేసే వాతావర ణంతో పాటు, పనిచేసేందుకు అవసర మైన స్వేచ్ఛను, వసతులను కల్పిస్తే మరింత సేవలు అందించేందుకు ఆస్కారం ఉం టుందని తెలిపారు. రాబో యే కాలంలో జిల్లాలోని అధికారులు, సిబ్బంది అందరు ఒక టీమ్‌వర్క్‌లా పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుక రావాలని ఆయన కోరారు. జిల్లా నుంచి బదిలీపై వెళు తున్న రెవెన్యూ కలెక్టర్ కె. సీతారామారావు మాట్లాడు తూ జిల్లా ప్రజలు, ఉద్యోగులు మంచి మనసున్న వారని, జిల్లాలోని ఉద్యోగులందరు కుటుం బసభ్యుల మాదిరి కలిసి చేసుకున్నం దువల్లనే అన్ని పనులు విజయవంతంగా పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఆయన స్థానంలో నూతనంగా బాధ్యతలు తీసుకున్న రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా ఎస్. మోహన్‌రావు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ఎలాంటి ఒత్తిడి లేనివిధంగా విధులు నిర్వహించాలని అన్నారు. స్థానిక సంస్థల నూతన అదనపు కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్ ధోత్రే మాట్లాడుతతూ ప్రతీ ఉద్యోగి తన విధుల నిర్వహణలో సంతోషంగా చిరునవ్వుతో నిర్వహించాలని సూచించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా మహబూబ్ నగర్ జిల్లాలో విధులు నిర్వహించి మెదక్ జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీపై వెళ్తున్న పద్మశ్రీ మాట్లాడుతూ తన ఉద్యోగ కాలంలో జిల్లా ఉద్యోగులు, ప్రజలు ఇచ్చిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. గజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్డీఓ అనిల్ కుమార్, టీజీఓ అధ్యక్షుడు రాజగోపాల్, టీఎన్‌జీఓ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, కార్యదర్శి బక్క శ్రీనివాస్, టీఎన్‌జీఓ సెక్రటరీ చంద్రనాయక్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చెన్నకిష్టన్న, పలువురు జిల్లా అధికారులు పాల్గొని మాట్లాడారు. అనంతరం బదిలీపై వెళ్తున్న రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావును సన్మానించడమే కాకా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్లను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment