వీడియో చూడండి : చరిత్ర సృష్టించిన భారత్..చంద్రుడి మీదకు దూసుకెళ్లిన చంద్రయాన్ 3
Chandrayan 3 Launch :
అంతరిక్ష రంగంలో మరో అరుదైన రికార్డు భారత్ పేరిట నమోదైంది. భారత్ తో పాట ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ 3 ప్రయోగంలో మొదటి దశ అయిన లాంఛింగ్ ను ఇస్రో(ISRO) విజయవంతంగా నిర్వహించింది. గురువారం మధ్యాహ్నం 1:05 నిముషాలకు చంద్రయాన్-3కు(Chandrayan 3) కౌంట్‌డౌన్ ప్రారంభమవగా.. ఇవాళ(జులై 14,2023) మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3 జాబిలి మీదకు దూసుకెళ్లింది. చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్ మరియు ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. ఈ మిషన్ లో భాగంగా రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ లను జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ తీసుకెళుతోంది. దీని బరువు దాదాపు 3,900 కిలోగ్రాములు.చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రత్యక్షంగా వీక్షించారు.
మొత్తం 48 రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాన్ 3.. ఆగస్ట్ 23 లేదా ఆగస్ట్ 24న చంద్రుడి దక్షిణ దృవం మీద మీద ల్యాండయ్యేలా ల్యాండర్‌ని ప్రయోగిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. లేని పక్షంలో మరో నెల రోజుల తర్వాత ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తామని తెలిపారు. అయితే చంద్రుడి దశలను బట్టి దాని మీద ల్యాండర్‌ను దింపాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రుడి మీద దిగి పరిశోధనలు చేసే ల్యాండర్, రోవర్ మాడ్యూల్ పనిచేయడానికి పవర్ కావాలి. ఆ పవర్.. సోలార్ ప్లేట్ ల నుంచి మాత్రమే ల్యాండర్, రోవర్లు పొందగలుగుతాయి. అంటే ల్యాండర్ దిగే సమయానికి అక్కడ సూర్యరశ్మి ఉండాలి. అంటే చంద్రుడి మీద పగలు ప్రారంభమయ్యే సమయానికి ల్యాండింగ్ జరగాలి. భూమి మీద ఒక రోజుకి, చంద్రుడి మీద ఒక రోజుకు చాలా తేడా ఉంటుంది. చంద్రుడి మీద ఒక రోజు అంటే అది భూమి మీద దాదాపు 29 రోజులకు సమానం. అంటే చంద్రుడి మీద ఒక పగలు అంటే దాదాపు 14 రోజులు ఉంటది. ఆ 14 రోజులు మాత్రమే అక్కడ సూర్యకాంతి లభిస్తుంది. అంటే ఆ 14 రోజులు మాత్రమే ల్యాండర్, రోవర్లకు కావాల్సిన సౌరశక్తి అందుతుంది. అందుకే చంద్రుడిపైకి పంపుతున్న ల్యాండర్, రోవర్ల జీవిత కాలం కేవలం 14 రోజులే అని ఇస్రో తెలిపింది.
చంద్రయాన్-3 మిషన్ కోసం అంచనా వేసిన బడ్జెట్ రూ.600 కోట్లు. అయితే దీన్ని కాస్త పెంచడంతో చివరి బడ్జెట్ రూ.615 కోట్లకు చేరింది. అయితే చంద్రయాన్-2తో పోలిస్తే ఈ బడ్జెట్ ఇప్పటికీ చాలా తక్కువ. ఎందుకంటే.. చంద్రయాన్-2 మిషన్ బడ్జెట్ దాదాపు 978 కోట్ల రూపాయలు. చంద్రయాన్-3 తక్కువ ధరకు ప్రధాన కారణం అది ఆర్బిటర్‌ను ఉపయోగించకపోవడమే. ఆర్బిటర్‌కు బదులుగా.. ప్రొపల్షన్ మాడ్యూల్ ఉపయోగించబడింది. ఆర్బిటర్‌తో పోలిస్తే దీని నిర్మాణానికి తక్కువ ఖర్చు అవసరం అవుతుంది. అందుకే ఈ ప్రచార బడ్జెట్ కూడా తగ్గింది.
కాగా, ఇప్పటి వరకు ఎవరూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఇస్రో 2019లో చంద్రయాన్-2 మిషన్‌ను చేపట్టింది. అయితే, చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ఆర్బిటర్ సాఫ్ట్ ల్యాండింగ్ విఫలమైంది. అయినప్పటికీ.. చంద్రుని చుట్టూ ప్రస్తుతం విజయవంతంగా పరిభ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-2లోని లోపాలను సవరిస్తూ తాజాగా, ఇస్రో చంద్రయాన్-3 చేపట్టింది. కాగా,ఇప్పటి వరకు అమెరికా, రష్యా , చైనా దేశాలు మాత్రమే చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తమ వాహకనౌకలను ల్యాండ్ చేయగలిగాయి.
Chandrayaan-3: విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లపై ఇస్రో ప్రకటన
ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ ‘నిద్ర’ లేవకపోతే ఏమవుతుంది? వాటి ‘రహస్యాలను’ ఇతర దేశాలు తెలుసుకుంటాయా?
ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ ‘నిద్ర’ లేవకపోతే ఏమవుతుంది? వాటి ‘రహస్యాలను’ ఇతర దేశాలు తెలుసుకుంటాయా?
చంద్రుని మీద టైం ఎంతో చెప్పగలమా
కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్ 3.. చందమామపైకి 40 రోజుల జర్నీ స్టార్ట్.
Chandrayaan 3: చంద్రుడిపై 8 మీటర్లు ప్రయాణించిన రోవర్
Chandrayaan-3: ఆ 18 నిమిషాలు నరాలు తెగే ఉత్కంఠ. 18 మినిట్స్ ఆఫ్ టెర్రర్
చంద్రయాన్ 3: ఇస్రో కీలక ప్రకటన. చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ అసైన్మెంట్ పూర్తి
చంద్రయాన్ 3 అద్భుతం : విక్రమ్ ల్యాండర్ గాల్లోకి లేచి.. 40 సెంటీమీటర్లు ప్రయాణం
జాబిల్లిపైకి జపాన్.. నింగిలోకి హెచ్-2ఏ రాకెట్
సెల్ఫీలు పంపిస్తున్న ఆదిత్య ఎల్1 : భూమి -.. చంద్రుడి మధ్య ఉన్న శాటిలైట్
చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా?
ఆసక్తికరం : చంద్రయాన్ - 3 విజయంలో.. మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ పాత్ర?
చంద్రయాన్-3 ఒక భారతీయ అంతరిక్ష మిషన్ గా పేరు.
అనుకున్నట్లే. చక్కగా పని చేస్తున్న చంద్రయాన్. కక్ష్య మారి దూసుకెళుతుంది
Chandrayaan-03: నిప్పులు చిమ్ముతూ.. జాబిల్లి వైపు దూసుకెళ్లిన చంద్రయాన్-03 రాకెట్
ISRO: ఇస్రోలో సైంటిస్ట్ అవ్వడమే మీ లక్ష్యమా..? అయితే, ఈ మూడు దారులు మీ కోసమే..!
Chandrayaan 3: చంద్రయాన్-3 మిషన్.. కీలకమైన భాగాలు సరఫరా చేసింది ఈ కంపెనీయే..
very good
ReplyDelete