Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూ అవసరం లేదు.. టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు (Tirumala Darshanam) టీటీడీ (TTD) పలు రకాల మార్గాలను భక్తులకు అందిస్తోంది. వీటిలో సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవా దర్శనం, ఆర్జిత సేవా దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం వంటివి ఉన్నాయి.
తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు (Tirumala Darshanam) టీటీడీ (TTD) పలు రకాల మార్గాలను భక్తులకు అందిస్తోంది. వీటిలో సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవా దర్శనం, ఆర్జిత సేవా దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం వంటివి ఉన్నాయి.
సామాన్య భక్తులకు కూడా శ్రీవారి ఆర్జిత సేవా భాగ్యం కలిగించేందుకు లక్కీ డిప్ విధానాన్ని అమలు చేస్తోంది. తాజాగా లక్కీడిప్ ద్వారా సేవా టికెట్లు పొందే విధానంలో స్వల్ప మార్పులు చేసింది టీటీడీ. వీఐపీ బ్రేక్ దర్శనం విషయంలోనూ మార్పులు చేసంది.
తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, తిరుమలలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, తిరుపతిలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, తిరుమల వార్తలు" width="1200" height="800" /> తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనం పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు టీటీడీ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. "పే లింక్" ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చు.
సిఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లను భక్తులకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానంలో టికెట్లు పొందిన భక్తులు కౌంటర్ వద్దకు వచ్చి సొమ్ము చెల్లించి టికెట్లు పొందాల్సి వచ్చేది. నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ ను పంపుతారు.
భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యుపిఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ నూతన విధానాన్ని ప్రస్తుతం సిఆర్వోలోని లక్కీడిప్ కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
త్వరలో ఎంబీసీ-34 కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలుకానుంది. తాజా విధానంతో ఆర్జిత సేవ, బ్రేక్ దర్శనం టికెట్లు పొందే భక్తులకు ఇబ్బందులు తప్పనున్నాయి.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment