Breaking

Search Here

17 July 2023

IT Firms: ఐటీ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్. దిగ్గజ కంపెనీలకూ తప్పడం లేదటా. ఈసారి అది లేనట్లే!

 IT Firms: ఐటీ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. దిగ్గజ కంపెనీలకూ తప్పడం లేదటా.. ఈసారి అది లేనట్లే!


IT Firms: ఐటీ రంగం దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రస్తుతం భారత ఐటీ రంగంపై అనిశ్చిత మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక వృద్ధి మందకొడిగానే సాగుతోంది. దీంతో దిగ్గజ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటివి సైతం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వేతన పెంపులు వాయిదా వేస్తున్నట్లు సమాచారం. దీంతో ఉద్యోగులకు తీవ్ర నిరాశ తప్పడం లేదని తెలుసుతోంది. ఏప్రిల్- జూన్ క్వార్టర్‌కు సంబంధించి టీసీఎస్, హెచ్‌సీఎల్, విప్రోలు ఆర్థిక ఫలితాలను అందిస్తున్నాయి.


IT Firms: దేశీయ ఐటీ కంపెనీల్లో ఇప్పటి వరకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో వంటివి ఏప్రిల్- జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. ఇందులో టీసీఎస్ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించితే, మిగిలినవి మోస్టరు గణాంకాలనే వెల్లడించాయి. ఇన్ఫోసిస్ సహా మరికొన్ని కంపెనీలు త్వరలోనే వెల్లడించనున్నాయి. అయితే, ఈ ఆర్థిక ఏడాదిలో అంతా వృద్ధిలో మందగమనం కొనసాగొచ్చని, ఖాతాదారులు తమ ప్రాజెక్టుల వ్యయాలపై ఆచితూచి వ్యవహరించడం లేదా వాయిదా వేయడం కొనసాగొచ్చని ఫలితాల వెల్లడి సందర్భంగా ఐటీ సంస్థల నిర్వాహకులే ప్రకటించారు. కానీ, జూన్ త్రైమాసికంలో కంపెనీలు బారీ ఆర్డర్లను పొందడం, అమెరికాలో ద్రవ్యోల్బణం దిగివస్తున్నందున, ఐటీ వ్యయాలను ఖాతాదారులు పెంచుతారనే భావనతో శుక్రవారం మార్కెట్లో ఐటీ షేర్లు బాగా లాభపడ్డాయి.


ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో టీసీఎస్, హెచ్‌సీఎల్, విప్రో కంపెనీలు మొత్తంగా 13 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.1.06 లక్షల కోట్లు విలువైన ఆర్డర్లు దక్కించుకున్నాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 14 శాతం వృద్ధి సాధించాయి. ఈ కారణంతోనే రెండు రోజుల్లో నిఫ్టీ ఐటీ సూచీ 6 శాతం పెరిగింది. 2020 సెప్టెంబర్ తర్వాత ఈ సూచీకి అతిపెద్ద లాభం కావడం విశేషం. అయితే, దీనిని చూసి ఐటీ కంపెనీల కష్టకాలం పూర్తిగా ముగిసినట్లు కాదని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తుల్ అంచనాలపై ఐటీ కంపెనీల యాజమాన్యాలు, బ్రోకరేజీ సంస్థలు సానుకూల వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. అయితే, రానున్న రోజుల్లో పరిస్థితులు మెరుగుపడొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆదాయ వృద్ధి గణనీయంగా లేదని టీసీఎస్ ఎండీ సీఈఓ కృతివాసన్ పేర్కొన్నారు. 2023-24 ద్వితీయార్థంలో గిరాకీ పుంజుకోవడంపై టీసీఎస్, విప్రో యాజమాన్యాలు స్పష్టత ఇవ్వలేదు. గిరాకీపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని విప్రో తెలిపింది. ఈ ఏడాది రెండంకెల వృద్ధి సాధించడం కష్టతరమేనని టీసీఎస్ పేర్కొంది. అయితే, వృద్ధి అంచనాలపై హెచ్‌సీఎల్ టెక్ సానుకూలంగా ఉంది.


ఉద్యోగులకు ఇబ్బందులే.

స్వల్ప కాలంలో ఐటీ అనిశ్చితికి సంకేతంగా నూతన నియామకాల్లో క్షీణత కనిపిస్తోంది. తొలి త్రైమాసికంలో విప్రో, హెచ్‌సీఎల్ టెక్ ఉద్యోగుల సంఖ్య 11,300లకు తగ్గితే, టీసీఎస్ కేవలం 523 మంది ఉద్యోగులనే చేర్చుకుంది. ప్రతికూల పరిస్థితుల వల్ల వేతనాల పెంపును ఒక త్రైమాసికం పాటు వాయిదా వేస్తున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ వెల్లడించింది. ఇన్పోసిస్ కూడా ఇప్పటి వరకు వేతనాల పెంపు చేపట్టలేదు. వాయిదా వేయొచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ఫ్రెషర్ల నియామకాలు తగ్గాయి. ఈ ఏడాది జనవరి- మార్చిలో 4,480 మంది ఫ్రెషర్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నియమించుకోగా.. ఏప్రిల్ జూన్ త్రైమాసికంగా బాగా తగ్గింది. గత కొన్ని నెలలుగా ఐటీ కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చినా.. ఉద్యోగంలోకి తీసుకోవడానికి ఆలస్యం చేస్తుండడంతో చాలా మంది ఫ్రెషర్లు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.


No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments