Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్..!.. ఇంకా ఎలాంటి సమాచారం లేదు..?
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) కంపెనీ ఉద్యోగులకు నిరుత్సాహం కలిగించే నిర్ణయం తీసుకుందా?.. అనే ప్రశ్నకు ఔననే సమాధానమే వస్తోంది. ఉద్యోగులకు జీతాల పెంపు (Salary hike) నిర్ణయాన్ని కంపెనీ వాయిదా వేసినట్టు మనీకంట్రోల్ (Money control) రిపోర్ట్ పేర్కొంది. సాధారణంగా అయితే జీతాల పెంపు విషయాన్ని సీనియర్ మేనేజ్‌మెంట్ దిగువస్థాయి ఉద్యోగులకు జూన్ నాటికల్లా తెలియజేస్తారు. కానీ ఈ ఏడాది ఎలాంటి సమాచారం లేదు.
బెంగళూరు: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) కంపెనీ ఉద్యోగులకు నిరుత్సాహం కలిగించే నిర్ణయం తీసుకుందా?.. అనే ప్రశ్నకు ఔననే సమాధానమే వస్తోంది. ఉద్యోగులకు జీతాల పెంపు (Salary hike) నిర్ణయాన్ని కంపెనీ వాయిదా వేసినట్టు మనీకంట్రోల్ (Money control) రిపోర్ట్ పేర్కొంది. సాధారణంగా అయితే జీతాల పెంపు విషయాన్ని సీనియర్ మేనేజ్‌మెంట్ దిగువస్థాయి ఉద్యోగులకు జూన్ నాటికల్లా తెలియజేస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం ఉద్యోగులకు అలాంటి సమాచారమేమీ అందలేదని రిపోర్ట్ తెలిపింది. స్థూల ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు ఐటీ రంగంపై (IT Sector) ప్రభావం చూపిస్తున్నాయనేందుకు ఈ నిర్ణయాన్ని బట్టి అర్థంచేసుకోవచ్చునని పేర్కొంది. కాగా జీతాల పెంపును ఇన్ఫోసిస్ వాయిదా వేయడం 2020 తర్వాత ఇదే తొలిసారి. ఆ ఏడాది నిలుపుదల చేసి మరుసటి ఏడాది 2021లో జీతాల పెంపును కంపెనీ అమలు చేసింది.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) ఆర్థిక సంవత్సరం 2022-23 చివరి త్రైమాసికంలో బలహీన ప్రదర్శన చేసింది. ఇన్ఫోసిస్ మాదిరిగానే ఏప్రిల్ త్రైమాసికంలో విప్రో (Wipro), టీసీఎస్ (TCS) కంపెనీల లాభాలు కూడా తగ్గాయి. క్యు4లో కంపెనీ ఉద్యోగుల్లో 60 శాతం మందికి వేరియేబుల్ కంపోనెంట్ శాలరీని కూడా ఇన్ఫోసిస్ తగ్గించింది. ఈ పరిణామం తర్వాత టెక్ రంగంలోని పరిస్థితులపై ఆందోళనలు కూడా వ్యక్తమయిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment