Breaking

Search Here

20 July 2023

Government Jobs: గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు..

 

Government Jobs: 

గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు..


Government Jobs: 

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) తాజాగా గ్రూప్-ఏ, గ్రూప్-బీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్


కెరీర్‌లో స్థిరపడాలంటే మంచి ఉద్యోగం సాధించాలి. భవిష్యత్‌లోనూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోవాలంటే ప్రభుత్వ కొలువు అయితే బెటర్. అలాంటి అవకాశాన్ని అందిస్తోంది ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL). ఈ సంస్థ తాజాగా గ్రూప్-ఏ, గ్రూప్-బీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోని ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ గడువు ఆగస్టు 18న ముగియనుంది.


UCIL ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఇంజనీరింగ్‌లోని వివిధ విభాగాల్లో జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ సూపరింటెండెంట్ వంటి పోస్ట్‌లను భర్తీ చేస్తుంది. రిక్రూట్‌మెంట్ అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ వంటి వివరాలను పరిశీలిద్దాం.


ఖాళీల వివరాలు

UCIL ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూప్-ఏ విభాగంలో 44 పోస్టులు, గ్రూప్-బీ విభాగంలో 78 పోస్టులు భర్తీ చేస్తుంది.


అర్హత ప్రమాణాలు

దరఖాస్తుదారుల వయసు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది.


ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్


అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ)

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉండాలి. కనీసం 10 సంవత్సరాల పాటు డిఫెన్స్, పారామిలటరీ దళాల్లో పనిచేసి ఉండాలి.


చీఫ్ సూపరింటెండెంట్

గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ కాలేజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత ఫీల్డ్‌లో కనీసం ఐదేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి.


డిప్యూటీ జనరల్ మేనేజర్

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ, రెండేళ్ల పీజీ/డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత రంగంలో కనీసం 15 నుంచి 18 సంవత్సరాల వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.


జనరల్ మేనేజర్ (P&IRs)

ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, రెండేళ్ల పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.


అప్లికేషన్ ప్రాసెస్

ముందు UCIL అధికారిక పోర్టల్ https://ucil.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలోకి జాబ్స్ అనే సెక్షన్‌పై క్లిక్ చేయాలి.


ఇక్కడ కనిపించే లిస్ట్‌లో యూసీఐఎల్ గ్రూప్-ఏ, గ్రూప్-బీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేసి అప్లికేషన్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి.


అర్హత ఉన్న పోస్ట్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయండి. అవసరమైన డాక్యుమెంట్లను జత చేయాలి.


జనరల్ మేనేజర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్/పర్సనల్ & ఐఆర్‌లు/కార్పొరేట్ ప్లానింగ్), యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, (భారత ప్రభుత్వ సంస్థ) పి.ఓ. జాదుగూడ మైన్స్, జిల్లా- సింగ్భూమ్ ఈస్ట్, జార్ఖండ్-832102 అనే అడ్రస్‌కు అప్లికేషన్‌ను పోస్టల్ ద్వారా పంపాలి.


అప్లికేషన్ ఫీజు

జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ(ఎన్‌సీఎల్) కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అభ్యర్థులు ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా ఫీజును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.


ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల ఎంపికలో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో రాత పరీక్ష ఉంటుంది. రెండో దశలో గ్రూప్ డిస్కషన్, మూడో దశలో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అన్ని దశల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తారు.


జీతభత్యాలు

పోస్ట్‌ ఆధారంగా ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.30,000 నుంచి రూ.2,60,000 మధ్య ఉంటుంది.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments