కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్ 3.. చందమామపైకి 40 రోజుల జర్నీ స్టార్ట్.
బాహుబలికే బాహుబలి.. 6 లక్షల 40 వేల టన్నుల బరువైన రాకెట్ ద్వారా.. చంద్రుడిపై దిగే విక్రమ్ ల్యాండర్ అంతరిక్షంలోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. 13 నిమిషాల వ్యవధిలోని ఇది కక్ష్యలోకి వెళ్లటం తొలి విజయం అంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. విక్రమ్ ల్యాండర్ ను తీసుకెళ్లిన రాకెట్.. 4 లక్షల కిలోమీటర్లు జర్నీ చేసి.. కక్ష్యలోకి ప్రవేశించింది.
చంద్రుడిపై దిగే విక్రమ్ ల్యాండర్ 40 రోజులపాటు ప్రయాణించి.. చందమామపై దిగనుంది. ప్రస్తుత అంచనా ప్రకారం ఆగస్టు 23 లేదా 24వ తేదీన చంద్రుడిపై దిగనుంది ల్యాండర్.
23 రోజులు భూకక్ష్యలోని తిరుగుతూ తిరుగుతూ.. చంద్రుడి వైపు అడుగులు వేస్తుంది విక్రమ్ ల్యాండర్. ల్యాండర్ తో రోవర్ సైతం చంద్రుడిపై దిగనుంది. చంద్రుడి దక్షిణ ధృవం వైపు ఇస్రో ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ కానుంది. చంద్రుడి ఉపరితంపై పరిశోధనలు చేయనుంది. అక్కడి వాతావరణం, మట్టిని సేకరించి రిపోర్టులు పంపనుంది.
అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రాకెట్.. చంద్రయాన్ శాటిలైట్ ను విజయవంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మూడు దశలు విజయవంతం అయ్యాయని.. 40 రోజుల ప్రయాణం ప్రారంభం అయ్యిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment