Breaking

Search Here

27 September 2023

Chandrayaan-3: విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లపై ఇస్రో ప్రకటన

Chandrayaan-3: విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లపై ఇస్రో ప్రకటన

విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్ పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇస్రో ట్వీట్

ప్రస్తుతానికి వాటి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని స్పష్టీకరణ

సంబంధాలను తిరిగి ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగిస్తామన్న ఇస్రో


చంద్రుడిపై పరిశోధనలు పూర్తి చేసిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు నిద్రాణస్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. వాటిని తిరిగి క్రియాశీలకంగా మార్చడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా భారత అంతరిక్ష సంస్థ ఓ ట్వీట్ చేసింది. విక్రమ్, ప్రజ్ఞాన్‌లు మేల్కొన్నాయా? అనే విషయం తెలుసుకోవడానికి వాటితో కమ్యూనికేషన్ పునరుద్ధరణ ప్రయత్నాలు చేశామని, కానీ వాటి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని పేర్కొంది. వాటితో సంబంధాలను తిరిగి ఏర్పాటు చేసే ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తామని తెలిపింది.


చంద్రయాన్-3 ప్రయోగం నేపథ్యంలో విక్రమ్, ప్రజ్ఞాన్‌లు పద్నాలుగు రోజులే పని చేస్తాయి. ఆ తర్వాత అక్కడ సూర్యాస్తమయం కావడంతో రోవర్‌ను ఈ నెల 2న, విక్రమ్‌ను 4న నిద్రాణస్థితిలోకి పంపించారు. చంద్రుడిపై రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు 120 నుంచి 200 డిగ్రీల సెల్సియెస్‌కు పడిపోతాయి. అంతటి శీతల పరిస్థితుల్లో ఇవి పని చేసే అవకాశాలు లేవు. అయితే ప్రస్తుతం చంద్రుడి దక్షిణ ధృవంపై తిరిగి సూర్యోదయం కావడంతో కమ్యూనికేషన్ పునరుద్ధరణకు ఇస్రో చర్యలు తీసుకుంటోంది.



No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments