ఆసక్తికరం : చంద్రయాన్ - 3 విజయంలో.. మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ పాత్ర?
భారత్.. అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రునిపై అన్వేషణ కోసం ఇస్రో పంపిన చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా..ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కాని ఘనతను భారత్ సాధించింది. ఈ ప్రయోగం విజయ వంతం కావడం పట్ల ప్రపంచ దేశాలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాయి. ఈ తరుణంలో ఇస్రో చంద్రయాన్ - 3 విజయం వెనుక మసలా దోశ, ఫిల్టర్ కాఫీ ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఇది వినడానికి విచిత్రంగా, నమ్మశక్యంగా లేకపోయినా చంద్రయాన్ - 3 విజయంలో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ ప్రముఖ పాత‍్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇస్రో సైంటిస్ట్‌ల నుంచి సేకరించిన సమాచారంతో వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సీనియర్ పాత్రికేయురాలు బర్కాదత్. దీంతో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ నివేదికలు నిజమేనని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
చంద్రయాన్ -3 సక్సెస్‌లో ‘మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ పాత్ర’ పై ఆ ప్రాజెక్ట్ సైంటిస్ట్ వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ.. చంద్రయాన్-3 వంటి అసాధ్యమైన పనిని నిర్విరామంగా పనిచేసేందుకు ఒపిక, శక్తి కావాలి. అయితే, ‘ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మసాలా దోస, ఫిల్టర్ కాఫీని అందించడం ద్వారా అలసట అనే విషయాన్ని పక్కన పెట్టాం. ప్రతి ఒక్కరూ ఇష్టపూర్వకంగా అదనపు గంటలు పనిచేశారు. ఎక్కువ సేపు విధులు నిర్వహించేలా సంతోషంగా ముందుకు వచ్చారని గుర్తు చేశారు.
ఇస్రో సైంటిస్ట్‌ల పనితీరు అమోఘం
ఇస్రో మాజీ డైరెక్టర్ సురేంద్ర పాల్ కేవలం రూ.150 రూపాయల ఖర్చుతో ఒక సాధారణ ఎద్దుల బండిపై కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రవాణా చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు భారత్‌తో పాటు ఇతర దేశాల్లోని సైంటిస్ట్‌ల కంటే ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎక్కువగా ఉంటుందని ఇస్రో మాజీ చైర్మన్ జీ మాధవన్ నాయర్ చెప్పారు.
ఏది ఏమైనప్పటికీ, భారత్ చంద్రయాన్ -3పై చేసిన ఖర్చు, సాధించిన విజయాలు నభూతో నభవిష్యత్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే? ఒక బాలీవుడ్ సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చుతో ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటివరకు ఏ దేశమూ చేరని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి అందరి మన్ననలు అందుకుంది. చంద్రయాన్-3 మిషన్‌ను కేవలం రూ. 615 కోట్ల రూపాయలతోనే ఇస్రో చేపట్టింది. అంతరిక్ష రంగంలో అద్భుత విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 విజయంపై ఈ ఆసక్తికర కథనాలు వెలుగులోకి వచ్చాయి.
బాలీవుడ్ సినిమా నిర్మించేందుకు అయ్యే ఖర్చుతో

No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment