చంద్రయాన్ 3: ఇస్రో కీలక ప్రకటన.. చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ అసైన్మెంట్ పూర్తి
చంద్రయాన్ 3లో మరో కీలక ఘట్టం పూర్తి అయింది. చంద్రునిపై చక్కర్లు కొడుతున్న ప్రజ్ఞాన్ రోవర్ తనకు ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేసింది. ఇపుడు రోవర్ సురక్షితంగా పార్క్ చేయబడింది. మిషన్ లోని అన్ని పే లోడ్ ప్రస్తుతం స్లీప్ మోడ్ లోకి సెట్ చేయబడ్డాయని ఇస్రో ప్రకటించింది.
చంద్రుని ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ తన పనులను పూర్తి చేసింది. రోవర్ లోని అన్ని పేలోడ్ లు ఇప్పుడు స్లీప్ మోడ్ లో ఉంచబడ్డాయి.. APXS, LIBS పేలోడ్‌లు ఆఫ్ చేయబడ్డాయని ఇస్రో తెలిపింది. ఈ పేలోడ్ ల నుంచే డేటా ల్యాండర్ ద్వారా భూమికి ప్రసారం చేయబడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ బ్యాటరీ పూర్తి స్థాయిలో ఛార్జ్ చేయబడింది.. రిసీవర్ ఆన్ లో ఉంచాం.. సోలార్ ప్యానెల్ 2023 సెప్టెంబర్ 22న తదుపరి సూర్యోదయం తర్వాత కాంతిని స్వీకరిస్తుందని అంచనా వేస్తున్నామని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. మరో అసైన్మెంట్ కోసం ప్రజ్ఞాన్ రోవర్ మరోసారి అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది ఇస్రో.. లేకుంటే రోవర్ చంద్రుడిపై శాశ్వత అంబాసిడర్ గా ఉండిపోనుంది.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment