Breaking

Search Here

09 September 2023

Chandrayaan-3: ఆ 18 నిమిషాలు నరాలు తెగే ఉత్కంఠ. 18 మినిట్స్ ఆఫ్ టెర్రర్



Chandrayaan-3: ఆ 18 నిమిషాలు నరాలు తెగే ఉత్కంఠ. 18 మినిట్స్ ఆఫ్ టెర్రర్

ఇండియా అంతా ఒకే ఒక్క మాట.. చంద్రయాన్.. చంద్రుడిని ముద్దాడే అద్భుత ఘట్టంపై నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. మరికొన్ని గంటల్లోనే చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియ కాబోతుంది. ఇందులో కీలకమైన టైం ఏంటో తెలుసా.. ఆ 18 నిమిషాలు.. అవును.. చంద్రయాన్ శాటిలైట్.. చంద్రుడిపై దిగటానికి ఫిక్స్ చేసిన టైం. ఈ 18 నిమిషాలు అనుకున్నది అనుకున్నట్లు జరగాల్సి ఉంది. ఏ ఒక్క సెకన్ తేడా రాకుండా చూసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు అందరూ కూడా.. ఆ 18 నిమిషాలను ఇస్రో సైంటిస్టులు ఏ విధంగా ఆపరేట్ చేయబోతున్నారు.. సేఫ్ ల్యాండింగ్ ఎలా చేయబోతున్నారు అనేది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 


2023, ఆగస్టు 23, బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ఈ చంద్రయాన్-3 మిషన్.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్-3 జర్నీలో.. ఈ 40 రోజుల ప్రయాణం ఒక ఎత్తైతే... ల్యాండింగ్ ప్రక్రియ జరిగే చివరి 18 నిమిషాలు మరో ఎత్తు అన్నమాట. దశల వారీగా ఈ ల్యాండింగ్ ప్రక్రియ జరగనుంది. మొదట చంద్రయాన్ 3లోని బూస్టర్లను మండించడం ద్వారా దాన్ని చంద్రుడి కక్ష్య నుంచి ఉపరితలం వైపు పడేలా చేస్తారు. అక్కడి నుంచి ప్రతి క్షణం నరాలు తెగే ఉత్కంఠ మొదలవుతుంది.


దశల వారీగా ల్యాండింగ్ ప్రక్రియ

మొదట చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యే ప్రదేశానికి 745 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

అక్కడ నుంచి సెకనుకు.. 1.6 కిలోమీటర్ల వేగంతో.. 30 కిలోమీటర్ల కిందకు దిగుతుంది.

ఇదంతా 690 సెకన్లలో జరుగుతుంది.

చంద్రయాన్ 3లోని ఇంజన్లు ఆన్ అవుతాయి.

సైకిల్ బ్రేక్స్ వేసినట్లు.. స్పీడ్ తగ్గించుకుంటూ.. తనకు తాను కంట్రోల్ చేసుకుంటూ నిదానంగా కిందకు దిగుతుంది.

ఈ ప్రక్రియలో ల్యాండింగ్ ప్రాంతానికి 32 కిలోమీటర్ల దూరంలో.. చంద్రుడి ఉపరితలానికి 7.5 కిలోమీటర్ల దూరంలో ఆగుతుంది.

ల్యాండింగ్ స్పాట్ సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేయడానికి ఇదే సరైన సమయం. ఆ ప్రాంతం అనుకూలంగా ఉందా లేదా అనేది సెన్సార్లు ఎప్పటికి కప్పుడు సమాచారాన్ని ఇస్తూనే ఉంటాయి.

అనంతరం చంద్రుడి ఉపరితలానికి 6.8 కి.మీల ఎత్తుకు చేరుకున్న తర్వాత ల్యాండర్‌ తన రెండు ఇంజిన్లను ఆఫ్‌ చేసి.. మరో రెండు ఇంజిన్లనే ఉపయోగించుకుని వేగాన్ని తగ్గించుకుంటుంది. ఈ సమయంలోనూ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలానికి సమాంతరంగానే ఉంటుంది.

ఆపై ల్యాండర్‌ ఫైన్‌ బ్రేకింగ్‌ దశలోకి అడుగుపెడుతుంది. ఈ దశలో విక్రమ్ ల్యాండర్ నిటారు(90 డిగ్రీల కోణం)గా మారుతుంది, 

అలా క్రమక్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ చంద్రుడి ఉపరితలానికి 800-1300 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది.

అనంతరం సుమారు 12 సెకన్లలో మరింత కిందకు దిగి 150 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. 

అప్పుడు మరోసారి ల్యాండింగ్‌ కోసం ఎగుడు దిగుళ్లు, బండరాళ్లు లేని ప్రదేశం కోసం అన్వేషిస్తుంది. ల్యాండింగ్ స్పాట్ లో ఏవైనా సమస్యలుంటే.. విక్రమ్ ల్యాండర్ 150 మీటర్లు ముందుకు వెళ్లి మళ్లీ ప్రయత్నిస్తుంది.

అన్నీ సజావుగా ఉంటే తదుపరి 73 సెకన్లలో ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపై అడుగుపెడుతుంది. 

దీంతో టెన్షన్‌కు తెరపడి ప్రయోగం విజయవంతమవుతుంది.



No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments