చంద్రుని మీద టైం ఎంతో చెప్పగలమా
చంద్రుడి మీద ఇప్పుడు టైమెంత అంటే ప్రస్తుతానికైతే ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కానీ, భూమి మీద ఉన్నట్లే అంతరిక్షంలో కూడా సమయం ఉంటుంది.
అయితే రానున్న రోజుల్లో అనేక దేశాలు చంద్రుడి మీద అడుగు పెట్టి, అక్కడ పని చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్న తరుణంలో చంద్రుడి మీద కూడా అధికారికంగా సమయాన్ని నిర్ణయించడం మంచిది కదా అనే దానిపై చర్చ జరుగుతోంది.
చంద్రుడి మీద అందరూ అంగీకరించిన అధికారిక సమయం ఉండటం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ అంతరిక్ష పరిశోధన సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటోంది.
సమయంతో పాటు చంద్రుడికి సంబంధించిన మ్యాప్ తయారు చేయాలని.. చంద్రుడి మీద ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరిగేందుకు వీలుగా ప్రాంతాలను గుర్తించాలని ఆ సంస్థ చెబుతోంది.
ఈ దిశగా నాసాతో కలిసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పని చేస్తోంది.
ప్రస్తుతం చంద్రునికి సొంత టైమ్ జోన్ లేకపోవడం వల్ల అన్ని మిషన్లకు యూనివర్సల్ టైమ్(యూటీసీ)ను వాడుతున్నారు. అయితే రోజురోజుకు చంద్రుని మీదకు చేపట్టే మిషన్ల సంఖ్య పెరుగుతున్నందున యూటీసీ మీద ఎక్కువ కాలం ఆధారపడలేమని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటోంది.
స్పేస్‌క్రాఫ్ట్స్ వంటివి సమర్థవంతంగా పని చేయాలంటే కచ్చితమైన సమయం చాలా ముఖ్యం.
చంద్రుడి మీద ఇప్పుడు సమయం ఎందుకు లేదు?
చంద్రుడి కాలమానాన్ని ఏర్పాటు చేసేందుకు ఏదో ఒక అంతరిక్ష సంస్థ బాధ్యత తీసుకోవాలని యూరోపియన్ స్పేస్ అధికారులు చెబుతున్నారు.
చంద్రుడి కాలమానాన్ని నిర్ణయించడంలో భూమి మీద ఏదో ఒక దేశం సమయాన్ని ప్రామాణికంగా తీసుకోవాలా లేక దాన్ని మరెక్కడా వీలు లేకుండా చంద్రుడికి మాత్రమే పరిమితం చేయాలా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
చందమామ మీద గడియారాలు భూమి కంటే కాస్త వేగంగా తిరుగుతాయి కాబట్టి అక్కడ సమయాన్ని గణించడం కాస్త ఇబ్బందికరమైన వ్యవహారం.
భూమి మీద 24 గంటలతో పోల్చి చూస్తే చంద్రుడి గడియారం 56 మైక్రో సెకన్లు ఎక్కువగా ఉంటుంది. చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉండటమే దీనికి కారణం.
అందుకే చంద్రుడి మీదకు వెళ్లే వ్యోమగాములు తమ అపాయింట్‌మెంట్స్‌ను ముందుకు జరుపుకోవడానికి ఇదే కారణం కావచ్చు. భూమి మీద ఉన్న టైమ్ జోన్లను చంద్రుడి మీద అనుసరించడం సరికాకపోవచ్చు
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment